విజయమ్మ స్పీచ్ అదరహో..!
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు , దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజ యలక్ష్మి తన తొలి ప్రసంగం ఆకట్టుకునేలా మాట్లాడారు.ఆమె కంట తడి పెట్టడమేకాదు. ఇడుపులపాయ ప్లీనరీ ప్రాంగణంలో ఉన్నవారందరితో కంట తడిపెట్టించేలా మాట్లాడడం విశేషం. రాజశేఖరరెడ్డి జీవిత ప్రస్థా నాన్ని తడుముతూ, రెండువేల తొమ్మిదిలో ఆయన మరణించే వరకు సాగిన ఘటనలతో పాటు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చాలా చక్కగా, ఆవేదన కలిగించే రీతిలో చెప్పడం ఆసక్తి కలిగించింది. సోనియాగాంధీ వద్దకు వెళ్లినప్పుడు జరిగిన ఘట్టాన్ని కూడా ఆమె వివరించిన తీరు. ఆ తర్వాత తన కుమారుడు జగన్ తో కలిసి సొంత పార్టీ పెట్టుకోవలసిన అవసరం ఎలా వచ్చిందో ఆమె వివరించారు.తన మరిది కి మంత్రి పదవి ఇచ్చినందుకు బాధ లేదని, కాని జరిగిన పరిణామాలు బాధ కలిగించాయని చెప్పడం కూడా ఆసక్తికరంగా ఉంది. రాజశేఖరరెడ్డి కి ఉన్న విశ్వసనీయత జగన్ కు కూడా ఉందని, అదే పట్టుదల, అదే మాటతప్పని గుణం జగన్ కు ఉ ందని చెబుతూ, జగన్ ను మీకు అప్పగిస్తున్నానని హృద్యంగా అన్న తీరు సహజంగానే సభికులను కలచివేస్తుంది. ఆమె ఒక సందర్భంలో కంట తడి కనిపించింది. ఎన్నికల ప్రచారంలో ఒక్క ఉప న్యాసం కూడా చేయకుండా, అసలు ఈమె మాట్లాడగలరా అన్న సందేహాలు ఉన్న తరుణంలో ఆమె తడు ముకోకుండా ప్రసంగించిన తీరు అందరికి ఆశ్చర్యం కలిగించిందని చెప్పక తప్పదు.జగన్ ను వేధించడానికి ప్రభుత్వం, కోర్టు ద్వారా సాగుతున్న యత్రాలు అంటూ కన్విన్సింగ్ గా మాట్లాడడం విశేషం.మొత్తం మీద భవిష్యత్తులో విజయలక్ష్మి తన కుమారుడి తరపున రాష్ట్రం అంతటా కూడా ప్రచారం చేస్తారా? కంటతడి పెట్టించే రీతిలో ఇదే ప్రకారం మాట్లాడితే మాత్రం ఓటర్ల నుంచి సానుభూతి వర్షం కురిసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి