జగన్ కేసులో దమ్ము లేదా..?
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆస్తుల కేసులో సిబిఐకి గట్టి సాక్షాధారాలు దొరకలేదా?హైకోర్టుకు సిబిఐ ఇచ్చిన నివేదికలో జగన్ ఆస్తులపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితేకాని ఏమైనా కేసులు ఉన్నది, లేనిది చెప్పజాలమని సిబిఐ స్పష్టంచేసినట్లు కధనాలు వస్తున్నాయి.జగన్ ఆస్తులపై ప్రాధమిక విచారణ చేయవలసిందిగా హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర మంత్రి శంకరరావు జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించారని,కొందరు భూములు పొందినవారు కూడా ఇందులో ఉన్నారని శంకరరావు ఆరోపించగా, దానికి తెలుగుదేశం నాయకులు ఎర్రన్నాయుడు తదితరులో తోడయ్యారు. ఈ నేపధ్యంలో సిబిఐ దాదాపు మూడు వారాలు విచారణ జరిపినా చట్టవిరుద్దంగా లావాదేవీలు జరిగాయా? లేదా అన్నదానిపై సిబిఐ ఇంకా నిర్ధారణకు రాలేకపోయిందని అంటున్నారు. దానికి కారణం జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఆ సమయంలో భూములు కాని ప్రభుత్వం నుంచి లాభం పొందినట్లు కాని స్పష్టమైన ఆధారాలు లేకపోవడం, అలాగే ఈ కంపెనీలలో ఎవరూ తమను పెట్టుబడులకోసం బలవంతం చేశారని చెప్పకపోవడం కూడా ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ప్రాధమిక విచారణ లో తేల్చకుండా పూర్తి స్థాయి విచారణకు హైకోర్టు అనుమతి ఇస్తుందా అన్నది చర్చనీయాంశం.ఈ రోజు కొన్ని ఆంగ్ల పత్రికలలో కధనం ప్రకారం అయితే ప్రాధమిక విచారణలో ఏమితేలనట్లే కనబడుతోంది.
CBI ఒక తోలు బొమ్మ తప్ప ఇంకొకటి కాదు. రాజకీయాలలోకి రాక ముందు రెండెకరాల భూమి ఉన్న చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడో CBI చేత ఇంక్వైరీ చెయ్యించినా CBI బ్లాంక్షీట్లు ఇస్తుంది. అలాగని చంద్రబాబు ఏదో నిజాయితీపరుడని నమ్మేస్తామా?
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజగన్ జైలు కెళ్తే ఆనాటి మంత్రులకి తిప్పలు తప్పవు కాబట్టి జగన్ మీద పెట్టిన కేసులన్ని నీరు కారిపోతాయని అందరికి తెలుసు. ఇది ఒక రకమైన వేధింపులుగా భావించవచ్చు. ఒక్క కేసు కూడా రుజువు కాదు చూడండి.
రిప్లయితొలగించండి