ఐసీయులో రజనీకాంత్… ప‌రిస్థితి విషమించిందా?


ర‌జినీకాంత్ ప‌రిస్థితి విష‌మించిందా…? ఆయ‌న శ‌రీరం చికిత్స‌కి స‌హ‌క‌రించ‌డంలేదా…? ఆయ‌నని అత్య‌వ‌స‌ర చికిత్సా విభాగంలో అడ్మిట్ చేయ‌డాన్ని బ‌ట్టి ఈ ప్ర‌శ్న‌లు నిజ‌మేన‌నిపిస్తున్నాయి. ర‌జ‌నీకాంత్ గ‌త నెల రోజుల నుండి త‌ర‌చూ అనారోగ్యం కార‌ణంగా చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆయ‌న చెన్నైలోని ఓ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయ‌న క‌డుపునొప్పి కార‌ణంగా చికిత్స తీసుకుంటున్నార‌ని, ఆయ‌న ఆరోగ్యం త్వ‌ర‌లోనే కోలుకుంటుంద‌ని ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, డాక్ట‌ర్లు చెబుతూ వ‌చ్చారు.. కానీ.. తాజాగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసియు లోకి మార్చార‌ని, ఆయ‌న ఒక కిడ్నీ ప‌నిచేయ‌డంలేద‌ని, అలాగే జీర్ణాశ‌యం కూడా స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని తెలుస్తోంది.. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం విష‌మించింద‌ని.. ఆయ‌న‌కి అత్యుత్త‌మ చికిత్స‌ని అందిస్తున్నామ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ర‌జనీకాంత్ ఆరోగ్యం విషమించింద‌నే వార్త బ‌య‌టికి పొక్క‌డంతో ఆయ‌న అభిమానుల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న త్వ‌ర‌లోనే కోలుకుంటార‌ని, ఆయ‌న ఆరోగ్యం కుదుట ప‌డ్డాక పూర్తిగా రెస్ట్ తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.
న్యూస్ ఫ్రం చెన్నై

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

జపాన్ రేడియేషన్ ఇండియాకు వచ్చేస్తోందా?