సోనియా మాకు దేవత
“సోనియా మాకు దేవత, వైఎస్ పూజారి. నేను భక్తుడ్ని. పూజారి చనిపోతే ఆయన కుమారుడితో ఉండాలని ఎక్కడా లేదు. దేవతను వదల్లేం కదా” అని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అన్నారు . తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు, తాజా రాజకీయాలపై వార్షిక నివేదిక ప్రకటిస్తూ అయన మాట్లాడారు.. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించిన ఆస్తులనే ఆయన భార్య విజయమ్మ కూడా పులివెందుల ఉప ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని దీనిని బట్టి వైఎస్ ఆస్తులు పెరగలేదన్నారు. ఇదే సమయంలో జగన్ ఆస్తులు మాత్రం పెరిగాయన్నారు. భారతి సిమెంట్స్‌లో వాటాలు విదేశీ కంపెనీకి విక్రయించడం వల్ల జగన్ ముందస్తుగా రూ.86 కోట్ల పన్ను చెల్లించారని ఉండవల్లి పేర్కొన్నారు.
వైఎస్‌తో సాన్నిహిత్యం ఉన్న తనపై ఊసరవెల్లి.. నమ్మకద్రోహి.. అంటూ సాక్షి లో ఇష్టానుసారం కథనాలు రాసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు జనం తండోపతండాలుగా వచ్చారని.. అయితే వారంతా ఆయన్ను చూడ్డానికి వచ్చారే తప్ప ఓట్లు వేయడానికి కాదని తర్వాత ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. జగన్ పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
హైదరాబాదీలు తెలంగాణ కోరుకోవడం లేదు..
హైదరాబాద్ వాసుల్లో మెజార్టీ ప్రజలు తెలంగాణ కోరుకోవడం లేదు. అందుకే టీ ఆర్ ఎస్ మేయర్ ఎన్నికలలో పోటీకి దిగలేదు అని ఉండవల్లి పేర్కొన్నారు. “రాష్ట్ర విభజనపై తెలంగాణ వాళ్లకు ఎలాంటి సెంటిమెంట్ ఉందో హైదరాబాద్‌పై మాకూ అలాంటి సెంటిమెంటే ఉంది..’ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకూ హైదరాబాద్‌పై వేరే అభిప్రాయం ఉన్నా వారు బయటకు మాట్లాడడానికి భయపడుతు న్నారన్నారు. హైదరాబాద్ సమస్యను పరిష్కరిస్తే తెలంగాణ అంశం పెద్ద సమస్య కాదని తెలిపారు.
–KNM
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి