పోస్ట్‌లు

టాలీవుడ్ పై ఐటీ ఉచ్చు

చిత్రం
ఉన్నట్టుండి ఐటీ శాఖ తెలుగు సినీపరిశ్రమ (టాలీవుడ్) పై విరుచుకుపడింది. బుధవారం (23-03-11) ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఐటీ అధికారులు నాగార్జున, అనుష్క, రవితేజ కార్యాలయాలు, ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు లోని ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. అంతేకాదు, కామాక్షి మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ బెంబెలెత్తిపోయింది. ఈ ఐటీ దాడుల వెనుక `రాజకీయ' వ్యూహం ఉన్నట్టుగా టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

చిత్రం
దోమల శృంగారంపై పూర్తి అవగాహన ఉంటే, డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా, నిజమేనంటున్నారు అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలోని జీవరసాయన శాస్త్రవేత్తలు.   ఆడెస్ ఈజిప్టీ దోమల సెక్స్ లో ఒక రకమైన రసాయన చర్యల పట్టికను శాస్త్రవేత్తలు గుర్తించారు. మగదోమ స్పెర్మ్ లో ఉండే వంద రకాల ప్రొటీన్లు ఆడదోమల్లోని లక్షణాల్లో శాశ్వత ప్రాతిపదికన  మార్పులు తీసుకువస్తాయి. అవి ఆహారం (రక్తం) తీసుకునే విషయంలోనూ, అండాలను విడుదల చేయడంలోనూ, కలయక పద్ధతుల్లోనూ ఈ మార్పులు కొట్టొచ్చినట్టు కనబడతాయట. మగ దోమల్లో అంతకు ముందు కూడా కొన్ని రకాల ప్రొటీన్లు గుర్తించినా, సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఏ తరహా ప్రొటీన్లు ఆడదోమలోకి స్పెర్మ్ ద్వారా పోతున్నాయో ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. ఈ ప్రొటీన్లను స్పష్టంగా గుర్తించడం వల్ల రాబోయే కాలంలో ఆడ దోమలు పుట్టకుండా చేయడానికి వీలుచిక్కుతుందనీ, అప్పుడు డెంగ్యూ, వెస్ట్ నిలే వంటి వైరస్ ల వల్ల మనుషుల్లో జ్వరాలు రాకుండా చూడవచ్చని కార్నెల్  యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అసలు సంగతేమిటం...

అమ్మా, విలీనం చేస్తాం... రాష్ట్రం ఇచ్చేయండి

చిత్రం
 అమ్మా.. విలీనం చేస్తాం.. రాష్ట్రం ఇచ్చేయండి. వచ్చే జూన్ నెలలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయండి. ఆ తర్వాత తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాం అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు చెప్పినట్టు సమాచారం. ఇవి బయటకు పొక్కడంతో తెరాసకు చెందిన అగ్రనేతలు వివరణ ఇచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌లో ఎంఎస్ఓల సమావేశం జరిగింది. ఇందులో తెరాస అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హామీ ఇచ్చినట్టు చెప్పారు.    రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమె విధించిన షరతుకు తాను సమ్మతించానని చెప్పారు. అంతేకాకుండా, రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పానని ఆ సమావేశంలో గుర్తు చేసినట్టు వినికిడి. పదేళ్ళ పాటు హైదరాబాద్ ఇరు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, సీమాంధ్ర ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేసుకున్న తర్వాత తెలంగాణ ప్రాంతానికే హైదరాబాద్ రాజధానిగా వ్యవహరిస్తుందని కేసీఆర్ వ...

బర్నింగ్ కామెంట్రీ - రాజకీయ, సామాజిక వ్యంగ్యాస్త్రం - 2

చిత్రం
పదేళ్లనుంచీ సాగుతోంది సెంట్ మెంట్ `గాణం' చరణాలై పాడుతున్నాయ్ పార్టీలన్నీ ఏకమై `సీటు' గులాబీలపై కన్నేసిన కాంగీ వీలనమైపోవాలని అడుగుతోందా..బేరమై!                                         - నీల్ కొలికపూడి

ఇక మనవల్లకాదు...జంతువుల్నే నమ్ముకుందాం!

చిత్రం
 తనకంతా తెలుసుననీ, తనమాటే వేదమని భావించే మానవుడికి అతి త్వరలోనే తనకేమీ తెలియదనీ, ఈ భూమిమీద ఉన్న క్రిమికీటకాలకూ, పశుపక్షాదులకు తెలిసినంత జ్ఞానం కూడా తనకు లేదని గుర్తించే రోజు రాబోతున్నది.  ఇప్పటికే అనేక జంతువులు ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతుంటే, ఒక్క మానవజాతి మాత్రమే ఏమాత్రం ముందే పసిగట్టలేకపోతున్నది. భూకంపాలను ముందే పసిగట్టడానికి మానవుడు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు. అయితే, అదేపని కుక్కలు, కప్పలు, గుర్రాలు, కోళ్లు చాలా ఈజీగా చేసేస్తున్నాయి. తమ జాతిని ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోగలుగుతున్నాయి.  జపాన్ భూకంపంతో ఈ విషయం తెలిపోయింది. భూకంపం వచ్చినప్పుడు జంతువుల చేష్టలు ఇలా ఉంటాయి.....  కుక్కలు పదేపదే మొరుగుతుంటాయి.  గుర్రాలు సకిలిస్తుంటాయి  కోళ్లు వింతగా ప్రవర్తిస్తుంటాయి  కప్పలు దౌడుతీస్తాయి ఎలా పసిగడతాయి?    భూకంపం రావడానికి ముందు భూమి పొరల నుంచి తక్కువ పౌనఃపున్యం గల విద్యుదయస్కాంత కిరణాలు వెలువడుతుంటాయి. వాటి వల్ల చిరాకు చెందే గుణం ఈ జంతువులకు ఉంటుంది. అందుకే అవి పిచ్చిఎక్కినట్...

నీటి కోసం యుద్ధాలు తప్పవా?

చిత్రం
 ప్రపంచ నీటి సంరక్షణ దినం (మార్చి 22) .............................................. ...............   భూమిపై అపార జలం...తాగేందుకు నీరు స్వల్పం నేలపై నివశించే జీవులకు నీటి సమస్య దాహార్తితో నీటి కోసం ఎదురుచూపులు 2025నాటికి అనేక దేశాల్లో నీటి సమస్య నీటికోసం యుద్దాలు తప్పవా? ఎండిపోతున్న జీవనదులు పెరిగిపోతున్న అంతర్ రాష్ట్ర జలవివాదాలు నీటితో కోట్ల డాలర్ల వ్యాపారం 20 ఏళ్లలో జల అవసరాలు రెట్టింపు నదుల సంధానం మాటే మరిచిన పాలకులు

బర్నింగ్ కామెంట్రీ - రాజకీయ, సామాజిక వ్యంగ్యాస్త్రం - 1

చిత్రం
 బర్నింగ్ కామెంట్రీ ! ................................. గెలవాలని కసి ఉంటే దేనికైనా బరితెగిస్తారు మందుమగువులను ఎరవేసి ` సరస ' మైన ధరలకు ఓటుకొనే పెద్దలు రాజకీయ క్యాంపుల్లో వేస్తున్నారు అమ్మాయిలతో స్టెప్పులు - నీల్ కొలికపూడి