పోస్ట్‌లు

రెండుసార్లూ చెన్నై కింగ్స్‌కే..

చిత్రం
డిపెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస‌గా రెండ‌వ సారీ ఐపిఎల్ టైటిల్ గెలుచుకుంది.. ధోని సార‌ధ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌య‌దుంధుభి మ్రోగించింది. ఏ ఫార్మాట‌యినా కెప్టెన్‌గా త‌న‌కు తిరుగులేద‌ని ధోని నిరూపించుకున్నారు. ఇక చెపాక్‌లో ఎదురేలేని సూపర్ కింగ్స్‌ది ఫైనల్లోనూ అదే జోరు! ధోనీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో చెన్నయ్ సూపర్‌కింగ్స్ ఐపీఎల్ కిరీటం మరోమారు ఒడిసిపట్టింది! చెన్నయ్: డిఫెండింగ్ చాంప్ చెన్నయ్ అచ్చొచ్చిన చెపాక్ మైదానంలో వరుసగా తొమ్మిదో విజయం నమోదు చేస్తూ… రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన అంతిమ సమరంలో 58 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. విజ‌య్ సూప‌ర్ ఇన్నింగ్స్‌తో చెన్నై ఐదు వికెట్లకు 205 పరుగుల స్కోరు సాధించి భారీ ల‌క్ష్యాన్ని బెంగుళూరు ముందు ఉంచింది. కానీ బెంగుళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్యాన్ని ఛేధించే దిశ‌గా ప‌య‌నించ‌లేక‌పోయారు. ఎనిమిది వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 147 ప‌రుగుల‌కే చ‌తికిల ప‌డిపోయింది. వ‌రుస‌గా రెండ‌వ‌సారి ఐపిఎల్ టైటిల్ గెలుచుకున్న చెన్నై ముందు ముందు కూడా తన తిరుగులేని అధిప‌త్యాన్ని నిలుపుకుంటుందో ...

ఎప్పుడు చస్తావని అడగలేదు..

చిత్రం
ఎవరినైనా రిటైర్ మెంట్ గురించి అడగవచ్చేమోకాని , రాజకీయ నాయకులను అడిగితే వారికి చచ్చేంత కోపం వస్తుంది.సరిగ్గా ఇదే విధంగా మాట్లాడారు శివసేన అధినేత బాల్‌ ధాకరే. ఆయన ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా వచ్చిన ఒక ప్రశ్న ఏమిటంటే మీరు రాజకీయాలనుంచి రిటైర్ అవుతారు అని . దానికి ఆయన ఒకరకంగా మండి పడ్డారు. నా చావు కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అని ఎదురు ప్రశ్నించారు.83 ఏళ్ల వయసు కలిగిన బాల్‌ ధాకరేని మీ వారసత్వం ఎవరికి వెళుతుంది అని అడిగితే అసలు అలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తారో అర్ధం కాదని వ్యాఖ్యానించారు.అసలు ఆ రకంగా ఎందుకు ఆలోచిస్తారు. ధాంక్ గాడ్. మీరు నేరుగా అడగలేదు. మీరు చస్తే ఏమవుతుందని అడగలేదు. నేను చస్తే నేను ఏమి చేయగలను,ఏమీ చేయలేను. ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తుంటే నా చావు కోసం ఎదురు చూస్తున్నట్లుంది అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఉద్దేశించి అన్నారు.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఉద్దావ్ ఠాక్రే మీ స్థానాన్ని ఆక్రమిస్తారా అని అడిగితే, ఆయన నా స్థానం తీసుకుంటారా? ఇంకో స్థానం తీసుకుంటారా అన్న ప్రసక్తే లేదు. మీకు తెలుసా ? మీరెప...

అపోలో,కేర్,యశోదాలపై సిబిఐ కేసు

చిత్రం
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నాయన్న అభియోగం పై ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులపై సిబిఐ కేసు నమోదు చేసింది. కొద్దిరోజుల క్రీతం ఈ ఆస్పత్రులపై సిబిఐ దాడులు చేసింది. సుమారు అరవై కోట్ల కుంభకోణం జరిగినట్లు సిబిఐ అంచనా వేసింది.ఈ అవకతవకలకు గాను ప్రముఖ వైద్య సంస్థలైన కేర్, యశోద, అపోలో ఆస్పత్రులపై కేసులు నమోదయ్యాయి.అధిక బిల్లులు వేయడం ద్వారా ప్రభుత్వ నిధులను ఈ అస్పత్రులు కైంకర్యం చేశాయని సిబిఐ గుర్తించింది. ఉదాహరణకు కేర్ ఆస్పత్రి సిజిహెచ్ ఎస్ కింద నమోదైన ఒక రోగికి రూ.85 వేలకు గాను లక్షనలభై వేల రూపాయల బిల్లు వేశారు.ఆంజియోగ్రఫీకి గాను 4950 రూపాయలకు గాను 13500 రూపాయలు వసూలు చేశారు.ఒక్క కేర్ ఆస్పత్రిలో అధిక బిల్లుల వల్ల ప్రభుత్వానికి పదిహేడు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది.ఈ మూడు ఆస్పత్రులే కాక మరికొన్ని ఆస్పత్రులపై కూడా కేసులు నమోదయ్యాయి.

డ్రగ్స్ తో పట్టుబడిన ప్రేమికులు

చిత్రం
హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంద నడానికి తాజా ఘటనే నిదర్శనం. కొద్దిరోజుల క్రితం రవితేజ సోదరులుతో పాటు మరికొంతమంది పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే శనివారం సాయంత్రం జూబ్లిహిల్స్ లో ఓ ప్రేమికుల జంటనుంచి పదిగ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు ఉన్నతవిద్యావంతులు. ప్రేమికుడు అహ్మదాబాద్ ఐఐఎమ్ లో చదువుతుండగా, ఆమె హైదరాబాద్ లోని దక్కన్ కాలేజీలో ఎమ్బీబీఎస్ చదువుతుంది. వీరిపై గత కొద్దిరోజులుగా నిఘా పెట్టిన పోలీసులకు ఇవాళ కొకైన్ తో పాటు పట్టుపడ్డారు. వీరు సెలవు రోజుల్లో పబ్ లకు వెళ్లి , వీటి ద్వారా ఎంజాయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితోపాటు కొంతమంది మిత్రులు కూడా ఉన్నట్లు చెప్తున్నప్పటికీ ఎవరూ దొరకక పోవడం విశేషం. యువతరం చెడిపోతుందనడానికి, పక్కదారి పడుతుందనడానికి ఇదొక తాజా ఉదాహరణ.

ఎన్టీఆర్ విశ్వరూపం(పార్ట్ 3)

చిత్రం
బాల్యం ఓ కమ్మని కావ్యం ఎన్టీఆర్‌ బాల్యం కూడా ఓ కమ్మని కావ్యంలా సాగింది. కాలేజీ కుర్రాడిగా ఉన్నరోజుల్లోనే  మీసాల నాగమ్మగా కొత్త రూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సాహసి. అప్పటి నుంచి  ఎన్నో నాటకాల్లో నటించారు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులంటే ఏమిటో రుచిచూశారు.  అయినా కళామతల్లిని మాత్రం విడవలేదు. నందమూరి తారకరామారావు 1923 మే 28 సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో  జన్మించారు. కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి,  వెంకటరామమ్మ దంపతులకు పుట్టిన ముద్దుల బిడ్డడు ఎన్టీఆర్. పండంటి బిడ్డడికి  ముందుగా కృష్ణ అని పేరుపెట్టాలని కన్నతల్లి అనుకున్నారు. మేనమామ సలహా మేరకు  తారక రాముడు పేరు ఖరారు చేశారు. తరువాత ఆ పేరు తారక రామారావుగా మారింది.  విజయవాడ మున్సిపల్‌ స్కూల్‌లో చదువుకున్న తరువాత అక్కడే ఎస్‌.ఆర్‌.ఆర్‌  కాలేజీలో చేరారు. రామారావు ఆ కాలేజీలో చేరే సమయంలో విశ్వనాథ సత్యనారాయణ  తెలుగు విభాగానికి అధిపతిగా ఉండేవారు. అప్పుడే రామారావును  నాటకంలో నాగమ్మ పాత్ర  పోషించమని విశ్వన...

ముగ్గురు స్నేహితులు.. ఒక సినిమా..

చిత్రం
వాళ్ళు ముగ్గురు స్నేహితులు.. అందులో ఒక‌రు స్టార్ హీరో.. మ‌రో ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్స్‌.. ఈ ముగ్గురి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం.. ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల‌యితే.. మ‌రి ప్రొడ్యూస‌రెవ‌ర‌నేగా మీ డౌటు.. ఆ డైరెక్ట‌ర్ల‌లో ఒక డైరెక్ట‌రే ప్రొడ్యూస‌ర్‌.. ఆ హీరో ర‌వితేజ అయితే ఆ ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు వైవిఎస్ చౌద‌రి, గుణ‌శేఖ‌ర్‌, వీరిద్ద‌రూ ఇండ‌స్ట్రీ రికార్డ్ చిత్రాల‌ని అందించిన వారే అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం మాత్రం వీరిద్ద‌రూ ఇండస్ట్రీ రికార్డ్ ఫ్లాఫులిచ్చి వారి ఇమేజీని డామేజి చేసుకున్న ప‌రిస్థితిలో ఉన్నారు. ర‌వితేజ మాత్రం వీరిద్ద‌రికీ విరుద్దంగా ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలు చేస్తూ మాగ్జిమ‌మ్ స‌క్సెస్ రేట్‌తో మినిమ‌మ్ గ్యారంటీ హీరోగా వెలుగొందుతున్నారు. వీరు ముగ్గురు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం నిప్పు.. ఈ చిత్రానికి వైవిఎస్‌. చౌద‌రి నిర్మాత కాగా గుణ‌శేఖ‌ర్ దర్శ‌కుడు. గ‌తంలో ఈ క‌థ‌కి క‌త్తి అనే టైటిల్‌ని అనుకున్నా.. ఆ టైటిల్‌ని క‌ళ్యాణ్‌రామ్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆ టైటిల్‌ని లాక్కోవ‌డంతో నిప్పు అని మార్చారు. ఫ్లాఫ్ డైరెక్ట‌ర్లుగా పేరు తెచ్చుకున్న ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల‌క...

సీత‌య్య‌కి కోప‌మొచ్చింది..

చిత్రం
నంద‌మూరి హ‌రికృష్ణ‌.. ముద్దుగా ఆయ‌న‌ని సీత‌య్య అని పిలుస్తారు. ఆయ‌న సీత‌య్య చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో న‌టించి మెప్పించారు. అందులో ఆయ‌న ఒక డైలాగ్ చెబుతాడు.. సీత‌య్య ఎవ్వ‌రిమాటా విన‌డు అనే డైలాగ్ వుంది.. అప్ప‌టి ఉండి ఆయ‌న్ని నిక్‌నేమ్ సీత‌య్య అయిపోయింది.. ఇప్పుడిదంతా చెప్పిందెందుకంటే.. ఈరోజు మ‌హానాడు స‌భ‌లో ఆయ‌నకి కోప‌మొచ్చింది.. త‌న‌ని, త‌న కుమారుడిని మ‌హానాడులో ప్రాధాన్యం ఇవ్వ‌కుండా చంద్ర‌బాబు నాయుడు త‌న‌ని, త‌న కుమారుడు లోకేష్‌ని మాత్ర‌మే హైలెట్ చేస్తూండ‌డంతో హ‌రికృష్ణ స‌హించ‌లేక‌పోయారు. ఇక హ‌రికృష్ణ త‌మ్ముడు, చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌కృష్ణ షూటింగ్ ఎగ్గొట్టి మ‌రీ మ‌హానాడు స‌భ‌కి వ‌చ్చాడు. ఆ సంద‌ర్భంలో బాల‌కృష్ణ‌, చంద్ర‌బాబు నాయుడులు వేదిక‌పై కూర్చొని ఉండ‌గా హ‌రికృష్ణ‌ని కూడా అక్క‌డికి ఆహ్వానించారు. దాంతో ఆయ‌న‌కి కోపం వ‌చ్చింది.. టిడిపి పార్టీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుతో ఏవో ఘాటుగానూ, ఆగ్ర‌హంగానూ చంద్ర‌బాబు వైపు చూపిస్తూ మాట్లాడిన సీత‌య్య‌.. ఇక అక్క‌డ ఉండ‌కుండా వెంట‌నే బ‌య‌టికి వెళ్ళిపోయారు. ఇప్ప‌టి వ‌ర‌కూ నారా, నంద‌మూరి వారి వార‌స‌...