పోస్ట్‌లు

ద‌డ పుట్టించేందుకు సిద్ద‌మ‌వుతున్న నాగ‌చైత‌న్య‌

చిత్రం
నాగచైతన్య, కాజల్ కాంబినేషన్ లో అజయ్ భుయాన్ దర్శ కత్వంలో ‘దడ’ అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ‌చైత‌న్య ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్‌ని పోషిస్తున్నాడు.. కాలేజీలో బుద్దిగా చ‌దువుకుంటూ పుస్తకాల పురుగు అనిపించుకోవడం కంటే, వ్యవస్ధలోని పురుగులని ఏరివేసి, చదువు పేరు తో వెర్రి వేషాలు వేసే వారందరికి దడ పుట్టించే సత్తా ఉన్నవాడుగా నాగ‌చైత‌న్య క‌నిపిస్తాడు.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆంధిస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య అన్నగా తమిళ హీరో శ్రీరామ్ కనిపించనున్నాడు. ఇక బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ చిత్రానికి కెమెరాని జ్ఞాన శేఖర్(వేదం ఫేమ్) అందించనున్నారు. బొమ్మరిల్లు చిత్రానికి మాటలు రాసిన అబ్బూరి రవి ఈ చిత్రానికి డైలాగులు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి తమ కామాక్షి మూవీస్ ఎంటర్టైనర్ పతాకంపై రూపొందిస్తున్నారు.

టెస్ట్ మ్యాచ్‌లో ద్ర‌విడ్ సెంచ‌రీ…

చిత్రం
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టుబిగిం చింది. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ విలువైన ఇన్నింగ్స్ ఆడి త‌న 32వ సెంచ‌రీని న‌మోదు చేయ‌డంతో ప్రత్యర్థి ముందు 326 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మూడు వికెట్ల నష్టానికి 91 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బుధవారం ఆటకొనసాగించిన భారత్ 252 పరుగులకు ఆలౌటయింది. ద్రావిడ్ 112 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక టెస్టుల్లో బ్యాట్‌కి ప‌నిచెబుతార‌ని భార‌త్‌ని ఆదుకుంటార‌ను కున్న విజ‌య్‌, వి.వి.ఎస్‌. ల‌క్ష్మ‌ణ్‌లు అవుట్ కావ‌డం నిరాశ క‌లిగించే అంశం.. ద్రావిడ్‌తో పాటు మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ కూడా ముందు ముందు రానిస్తే టెస్ట్ సిరీస్ కూడా భార‌త్ వ‌శం అవుతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు.

సుడిగాలికి తిరగబడ్డ రైలు!

చిత్రం
తెలుగు సినిమాల్లో ఫ్యాక్ష‌న్‌ సినిమాల‌లో క‌నిపించే దృశ్యం ఇక్క‌డ నిజంగానే జ‌రిగింది. ఎవ‌రూ తొడ‌గొట్ట‌కుండానే సుడిగాలి ఇంతెత్తున లేచి ఏకంగా ఒక రైలుని ఎత్తి ప‌డేసింది. అస‌లు విష‌యం ఏమిటంటే… అమెరికా వంటి దేశాల్లో మరీ ముఖ్యంగా టోర్నాడోలు (సుడిగాలులు వంటివి) రావడం మాములైపోయింది. టొర్నాడోలు వచ్చేయాటంచాలు ప్రజలు భయంభ్రాంతులకు గురి అవుతుంటారు. అలాంటి మహా సుడిగాలి ఒకటి మధ్య ప్రాశ్చమంలో వచ్చింది. అది రైలును పడేసింది. ఓసారి ఈ వీడియో చూడండి..

సామూహిక స్నానాల రికార్డు..!

చిత్రం
ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొంద‌డానికి ఎంత‌కైనా తెగించేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు.. తాజాగా ‘వరల్డ్ స్కిన్నీ డిప్పింగ్’ రికార్డు కోసం 400 మంది స్ర్తీ, పురుషులు క‌లిసి ఏ మాత్రం సిగ్గు పడ(లే)కుండా వంటి మీద నూలు పోగు లేకుండా సముద్రపు నీటిలో గంతులేశారు. న‌గ్నంగా  సామూహిక స్నానాలు చేసి రికార్డు నెల‌కొల్పారు. ఇంత‌కు ముందు 240 మంది స్ర్తీ, పురుషులు న‌గ్న‌స్నాన మాచ‌రించి నెల‌కొల్పిన రికార్డును వీళ్లు తిర‌గ‌రాసార‌న్న మాట‌.. దీనికి వారు పెట్టుకున్న ముద్దు పేరు  ‘వరల్డ్ స్కిన్నీ డిప్పింగ్.. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి ఇందులో పాల్గొన‌డానికి ఉత్సాహ‌వంతులు ఈ కార్య‌క్ర‌మ వేదిక అయిన‌ సౌత్ వేల్స్ చేరుకొని గౌవెర్ రోస్సీలీ బీచ్‌లో ఈ రికార్డు నెలకొల్పారు. మ‌న ఇండియాలో అయితే సామూహిక వివాహాలు జ‌రుగుతాయి కానీ.. ఇలా సామూహిక స్నానాలు అనేటివి ఉంటాయా.. అస‌లలాంటి ఆలోచ‌నైనా వ‌స్తుందా..?  వెయ్యి వేయిత‌ల‌లు అన‌డానికి ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఉదాహ‌ర‌ణ‌లుగా నిలుస్తుంటాయి.. అయితే.. ఇక్క‌డ మ‌రో విశేషం ఏమిటంటే.. వీరు ఇలా రికార్డు నెల‌కొల్పింది.. త‌మ స్వ‌ప్ర‌యోజ‌నం కోసం కాదు.. నేష‌...

అటు కేంద్ర మంత్రి, ఇటు రాష్ట్ర మంత్రి.. మ‌ధ్య‌లో పోలీసులు..!

చిత్రం
కేంద్ర‌మంత్రి జైపాల్‌రెడ్డి మేన‌కోడ‌లు డాక్ట‌ర్ కిర‌ణ్‌రెడ్డి హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది.. ఆమె భ‌ర్త చైత‌న్య రెడ్డే ఈ హ‌త్య చేసాడ‌ని రుజువ‌యింది.. మొత్తానికి ఓ హ‌త్య మిస్ట‌రీ ఛేధించామ‌ని పోలీసులు ఊపిరి తీసుకునే లోపులోనే మ‌రో మిస్ట‌రీ క్రియేట‌యి కూర్చుంది.. కారంణం హ‌త్య కి గుర‌యిన మ‌హిళ కేంద్ర‌మంత్రి జైపాల్‌రెడ్డి స్వ‌యానా మేన‌కోడ‌ల‌యితే, హ‌త్యకి పాల్ప‌డ్డ‌వాడు రాష్ట్ర‌మంత్రి డి.కె. అరుణ ద‌గ్గ‌ర బంధువు.. ఇప్పుడు మొద‌ల‌యింది అస‌లు క‌థ‌.. అటు జైపాల్‌రెడ్డి హ‌త్య చేసిన‌వాడిని క‌ఠినంగా శిక్షిం చాల‌ని ప‌ట్టుప‌డుతుంటే.. ఇటు డి.కె. అరుణ హ‌త్య చేసిన‌వాడికి స‌పోర్ట్‌గా నిలుస్తుంది.. ఇరువురూ క‌లిసి చ‌ర్చించి ఈ వివాదాన్ని ప‌రిష్క‌రిద్దామ‌ని ఆమె సూచించింది.. ఈ విష‌యంపై మాట్లాడేందుకు స్వ‌యంగా జైపాల్‌రెడ్డితోనే సంప్ర‌దింపులు జ‌రిపింది.. కానీ.. జైపాల్‌రెడ్డి ఇందుకు స‌సేమిరా అన‌డంతో డి.కె. అరుణ చాలా సీరియ‌స్‌గా వెళ్ళిపోయింది.. ఇద్ద‌రు మంత్రుల వ్య‌క్తుల‌కి సంబంధించిన ఈ కేసు ఇప్పుడు పోలీసుల‌కు పెను స‌వాల్‌గా మారింది.. ఏ చ‌ర్య‌లు తీసుకుంటే ఎక్క‌డి నుండి ఏ ఉప‌ద్ర‌వం ...

స‌త్తా చూపేందుకు సిఎం రెడీ..?

చిత్రం
ముఖ్యమంత్రి మెల్లమెల్లగా తన పవర్ ను పెంచుకుం టున్నట్లు కనబడుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక.. పార్టీ నుంచే కాక.. సహచరుల నుంచి ఎన్నో రకాల దాడులను ఎదుర్కొన్న కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు తన మార్క్ ను చూపెట్టు కోబోతున్నారు. బొత్సతో తనకు విభేదాలు లేవంటూనే.. రకరకాల ప్లాన్లతో చెక్ పెట్టేందుకు సిద్దమవు తున్నారు. తాజాగా.. ముఖ్యమంత్రి సోదరుడు.. కిషోర్ కుమార్ రెడ్డిని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డీసీసీ ) కి అధ్యక్షుడిగా నియమించేందుకు రంగం సిద్దమైనట్లు చెబుతున్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కిషోర్ అన్ని చూసుకునే వారట. జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకునే వారట. అప్పట్లో కిషోర్ కుమార్ రెడ్డి వాయల్పాడు నియోజకవర్గానికి ఇంచార్జీగా పనిచేశారు. అప్పట్లో కిషోర్ వ్యవహరశైలిపై చాలానే ఫిర్యాదులొచ్చాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఆయన్ని డైరెక్ట్ గా జిల్లా కాంగ్రెస్ కు అధ్యక్షున్ని చేయాలని చూస్తున్నారు. కాగా కిషోర్ నియామకాన్ని పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ అనుకూలంగానే ఉన్నట్లు చెబుతున్నారు. విజయనగరం జిల్లా ...

క‌రుణానిథి కూడా అన్నాహ‌జారేకు మ‌ద్ద‌తు..!

చిత్రం
తన కుమార్తె కనిమొళిని తీహారు జైలులో నిర్భంధించడానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తట్టుకోలేక పోతున్నారు. మీడియాలో ప్రచారమైన ఆరోపణలను నిజంచే యడానికి సిబిఐ ప్రయత్నిస్తోందని అన్నారు.కనిమొళిని అమా నుషంగా నిర్బంధించారని, కనిమొళి, కళైంగర్ టివీ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ కుమార్ లు అనారోగ్యంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.కాఆ లోక్ పాల్ బిల్లు పరిధిలోకి ప్రధాని పదవిని కూడా తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు . కాంగ్రెస్ పార్టీపై కోపం ఉన్నప్పట్టికీ రాజకీయ పరిస్థితుల రీత్యా ఆయన తగ్గి ఉంటున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే అవకాశం వచ్చిందని భావిస్తున్న కరుణానిధి లోక్ పాల్ బిల్లును అందుకు ఆసరాగా తీసుకుంటున్నారు. ప్రధాని పదవిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పడం ద్వారా కరుణానిధి ఈ ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పై విరుచుకుపడే పరిస్థితి రాలేదు.