పోస్ట్‌లు

రాయ‌ల‌సీమ బిడ్డ‌ని.. ఖ‌బ‌డ్దార్‌..

చిత్రం
నేనూ రాయ‌ల‌సీమ బిడ్డ‌నే.. తిరుప‌తిలో పుట్టి, తిరుప‌తిలోనే పెరిగిన వాడిని.. అంటూ ఘాటుగా మాట్లాడారు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న సోమ‌వారం నాడు తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. అన్నాహ‌జారే అవినీతి ఉద్య‌మానికి సంఘీభావం చెప్తూ ఆయ‌న తిరుప‌తిలో ఓ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు అడ్డు చెప్పారు. చంద్ర‌బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. అవినీతికి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు ఉద్య‌మం చేయ‌డం ఏంట‌ని ఎద్దేవా చేశారు. సాఫీగా సాగిపో్తున్న ఈ కార్య‌క్ర‌మం వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చేసిన హ‌ల‌చ‌ల్‌తో ఉద్రిక్త‌ల‌కి దారితీసింది. పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై లాఠీచార్జి చేయ‌డంతో వారు అక్క‌డినుండి వెళ్ళిపోయారు. అయితే అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ని రూ. 10 కోట్లు ఇచ్చి త‌న పార్టీలోకి తీసుకుంటున్నార‌ని, వైఎస్ విజ‌య‌మ్మ ప్ర‌ధాన‌మంత్రికి రాసిన లేఖ‌లో త‌న భ‌ర్త‌గానీ, త‌న కుమారుడు గానీ అవినీతికి ప‌ల్ప‌డ‌లేద‌ని చెప్ప‌లేద‌...

తెలుగును ప్రపంచ భాషగా మారుద్దాం!!

చిత్రం
మిత్రులందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు! శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి పుట్టిన రోజు ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తెలుగు భాషకు ఆధునిక హోదా సాధిద్దాం! తెలుగును ప్రపంచ భాషగా మారుద్దాం!! - ఆనంద్ కూచిభొట్ల తెలుగువారందరికీ తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా శుబాకాంక్షలు. అంతర్జాలం ద్వారా తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడదాం… - తుర్లపాటి నాగభూషణ రావు తేనెలొలుకు మన తెలుగు భాష వెన్నెలచందముగ వెలుగు భాష. వేల వత్సరముల ప్రాచీన భాష వేద భూమిపై వెలసిన భాష పదహారణాల పసందైన భాష పద్యాల పదునున్న హృద్యమైన భాష రామాయణమందించిన కవయిత్రి మొల్ల భాష భారతమ్ము రచియించిన కవిత్రయమ్ము భాష వేంకటేశ్వరుని కొలిచిన అన్నమయ్య భాష శ్రీ రాముని కీర్తించిన త్యాగయ్య భాష భద్రాచల రాముని సేవించిన కంచెర్ల గోపన్న భాష శతకములో బతుకు బాట చూపిన యోగి వేమన్న భాష పంచదార భాష, పాల బువ్వ భాష తేనె లొలుకు భాష..ఎంకి కులుకు భాష  మన తెలుగు భాష ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగుభాషా దినోత్సవం శుభా కాంక్షలు -కస్తూరి ఫణి మాధవ్ తెలుగువాళ్ళం మ‌నం.. మ‌న భాష‌ని ప‌రిర‌క్షించుకుందాం.. ఎక్క‌డ సంత‌కం ...

హ‌స్తిన‌లో రాంచ‌ర‌ణ్‌, ఉపాస‌న పెళ్ళి..?

చిత్రం
త‌న కుమారుడు రాంచ‌ర‌ణ్‌తేజ్ వివాహాన్ని ఘ‌నంగా చేయ‌డానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.. అయితే చ‌ర‌ణ్ పెళ్ళిని హైద‌రాబాద్‌లోనో, లేక త‌న సొంత గ్రామంలోనో కాకుండా ఏకంగా హ‌స్తిన‌లో అదే.. భార‌త రాజ‌ధాని ఢిల్లీలో చేయ‌డానికి సిద్ద‌ప‌డు తున్నారు. ఈ పెళ్ళిని ఆయ‌న రాజ‌కీయంగా కూడా ఉప‌యోగించుకోవాల‌ను కుంటున్నాడ‌న్న మాట‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య‌నే చిరంజీవి ఢిల్లీలో రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవ‌డం తెలిసిందే.. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించాల‌నుకున్నాడు. ఎఐసిసి అధ్య‌క్షురాలు సోనియాగాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరాల‌నుకున్నాడు. అయితే సోనియా చికిత్స నిమిత్తం అమెరికాలో ఉండ‌డంతో చిరుకి నిరాశే ఎదురైంది. చ‌ర‌ణ్ పెళ్ళిని హైద‌రాబాద్‌లో కాకుండా ఢిల్లీలో చేస్తే ఆ పెళ్ళికి సోనియాగాంధీ, ప్ర‌ధాన‌మంత్రితో స‌హా కాంగ్రెస్ పెద్ద‌లంద‌రినీ ఆహ్వానించ‌వ‌చ్చు.. ఢిల్లీలోనే పెళ్ళి కాబ‌ట్టి త‌ప్ప‌కుండా అంద‌రూ హాజ‌ర‌వుతారు.. దాంతో జాతీయ మీడియా ఈ పెళ్ళిని హైలెట్ చేస్తుంది. మీడియా ప్ర‌చారం, కాంగ్రెస్ పెద్ద‌ల ఆశీర్వాదం వెర‌సి ర...

లోక్ పాల్ ఏకైక పరిష్కారమా? – 2

చిత్రం
రాజకీయ శక్తుల జోక్యం ఈ దేశంలో రాజకీయ శక్తుల ప్రమేయం లేకుండా ఒక ఉద్యమం ప్రారంభమైనప్పటికీ,  ఆ తరువాత అది రాజకీయశక్తులతో కలుషితం కావడం ఖాయం.  సుంకిచిత ఆలోచనలతో సాగేవారి ఉద్యమాలు, భావస్వారూప్యతతో మద్దతు పలికేవారిని అండగా చూసుకుంటూ సాగించే పోరాటాలు చివరకు ప్రమాదకరమైన మలుపులు తిరగొచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సామ్యవాదం పేరిట ఆర్థికాభివృద్ధి చర్యలు చేపట్టినప్పుడే అవినీతికి బీజం పడింది. నాటి నుంచి అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. ఆమాటకొస్తే, స్వాతంతత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే తొలి కుంభకోణం వెలుగుచూసింది. ఈ పరిస్థితిని గుర్తించిన  ప్రభుత్వం అవినీతిని కట్టడిచేయడంకోసం చర్యలు ప్రారంభించింది . అందులో భాగంగానే అవినీతి వ్యతిరేక వ్యవస్థ అవతరించింది. అయితే, విచ్చలవిడిగా సాగిపోతున్న అవినీతి కుంభకోణాల అంతు చూడాలేంటే, సమర్థవంతమైన బిల్లు కావాలన్న ఆలోచన నుంచే జన్ లోక్ పాల్ బిల్లు మొగ్గతొడిగింది. నాడు తెల్లవాడు- నేడు మనోడు ఒకప్పుడు తెల్లవాడు వ్యాపారం చేసుకుంటానంటూ మనదేశ ...

పోలీసుల‌పై క‌ఠినంగా సుప్రీం..

చిత్రం
నకిలీ ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టు మరోసారి ధ్వజమెత్తింది. ఎన్ కౌంటర్ల విషయంలో పోలీసుల తీరుపై కోర్టు.. తీవ్రంగా తప్పు పట్టింది. మరోసారి రిపీట్ కావొద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. నకిలీ ఎన్ కౌంటర్లన్నీ.. దారుణహత్యలే అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అసలు ఎన్ కౌంటర్లన్నీ.. హత్యలే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదో రాజకీయనేతలు చెప్పారని.. లేదా ఉన్నతాదికారుల ఆదేశాలు పాటించామంటే.. ఇకపై కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇకపై బూటకపు ఎన్ కౌంటర్లు చేసే పోలీసులకు మరణశిక్ష విధించాలంటూ కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం నేరమని.. ఇలాంటి చర్యలు దారుణమని కోర్టు తెలిపింది.

తండ్రీ కొడుకుల మాయాజాలం..

చిత్రం

వీరెందుకు రాజీనామా చేయ‌లేదు..?

చిత్రం
జగన్ వర్గానికి చెందిన ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయలేదన్నదానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుద, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి లు తాము గతంలోనే రాజీనామా చేశామని, వాటిని ఆమోదించాలని కోరుతున్నామని చెప్పి ఊరుకున్నారు.కాని వాటిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ గత నెలలోనే తిరస్కరించారు. వీరిలో కొండా సురేఖ పై అనర్హత పిటిషన్ కూడా పెండింగులో ఉంది. అది వేరే విషయం. మామూలుగా అయితే జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇరవై ఆరుమంది రాజీనామాలు చేయగా వీరు మాత్రం చేయకుండా గతంలోనే రాజీనామా చేశామని ప్రకటించడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. కాగా దీనిపై కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నదేమిటంటే వీరు ముగ్గురు నిజంగానే మళ్లీ ఎన్నికలలో పోటీచేస్తే గెలుపు కష్టం అవుతందని అంటున్నారు. జగన్ కోసం రాజీనామా చేశామంటే తెలంగాణలో దానికి అంత స్పందన రాకపోవచ్చన్నది ఒక పాయింట్ అయితే, తెలంగాణ అంశంపై రాజీనామా చేశామని చెప్పినా వ్యక్తిగతంగా గెలవడం కష్టమని అందువల్లనే వారు ఆ ప్రకటన చేసి ఊరుకున్నారన్నది ఒక అ...