యథార్థ్ధం
త్రిలోక సంచారియైన నారదుడు బ్రహ్మలోకానికి వచ్చాడు. బ్రహ్మ, సరస్వతు లకు నమస్కరించాడు. అలాగే నిలబడి పోయి, పరధ్యానంగా వున్న నారదుణ్ణి బ్రహ్మదేవుని మాటలు వాస్తవంలోకి తెచ్చాయి. ఏమిటి నారదా… ఏమాలోచిస్తున్నావు! అంత పరధ్యానంగా వున్నావు!… భూలోకం నుంచేనా రాక!… విశేషాలేమిటి… అనడిగాడు బ్రహ్మ. అదే ఆలోచిస్తున్నాను స్వామీ…. సృష్టికర్త మీరే కదా! ముల్లోకాలనూ సృష్టించింది మీరేకదా!.. ఏమా ప్రశ్న నారదా!… అన్నాడు బ్రహ్మ. నాకో సందేహం స్వామీ… ఈనాడు భూలోకంలో శాస్త్రజ్ఞులు విత్తనాలు లేకుండానే కొత్త వంగడాలు సృష్టిస్తున్నారు. కృత్రిమ పద్ధతులలో జీవులను సృష్టించగల్గుతున్నారు. ప్రకృతి సహజంగా కాక, కృత్రిమ పద్ధతుల్లో మానవ సృష్టికూడా చేయగల్గుతున్నారు. ఇది చివరికెటుదారి తీస్తుందో… అని ఆలోచిస్తున్నాను స్వామీ…. అన్నాడు… నారదుడు. ఇదంతా విన్న బ్రహ్మదేవుడు కూడా ఆలోచనలో పడ్డాడు. ఇదిలాగే కొనసాగితే, మున్ముందు తన పనేమిటా అని…. అంతా వింటున్న సరస్వతీదేవి… మానవుడంతటి మేధాసంపన్నుడా!… సృష్టికి ప్రతి సృష్టి చేయగల దశకు చేరుక...