పోస్ట్‌లు

పోల‌వ‌రం టెండ‌ర్లు క్యాన్సిల్ చేయాల్సిందే..!

చిత్రం
పోలవరం టెండర్లపై మరోసారి తెలుగుదేశం పార్టీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. పోలవరం టెండర్లపై టిడిపి లేవదీసిన అంశాలపై చర్చకు కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి ప్రకటించారు. SEW కంపెనీకి చెందిన రాజాం నమస్తే తెలంగాణ పత్రికకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన టెండర్లు పూర్తికాక ముందు సీఎంని కలిసినట్లుగా శ్రీహరి ఆరోపించారు. ఆయనకు సీఎంను కలవాల్సినవసరం ఏముందని శ్రీహరి ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇవ్వాల్సిందిపోయి తిరిగి మాకు సవాల్ చేయడం వెనుక ఆంతర్యమేంటని కడియం ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటని, వేరే కంపెనీ ఎక్స్‌పీరియన్స్ లెటర్ పెట్టిన ఓ షూ కంపెనీకి అప్పజెప్పడం ఏంటని కడియం విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై మాకు స్పష్టమైన వైఖరి ఉందని, ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని శ్రీహరి చెప్పారు. అయితే నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు, గ్రామాలు ఎక్కువశాతం మునిగిపోకుండా, భూసేకరణలో ఇబ్బందులు లేకుండా చేయాల్సినవసరం ఉంద...

రెండు రోజుల్లో స‌క‌ల స‌మ్మె ప‌రిస‌మాప్తం..?

చిత్రం
సకల జనుల సమ్మె రెండు రోజులలో ముగుస్తుందని మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో సమ్మె ప్రభావం లేదని కూడా ప్రకటించడం విశేషం. కాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని కూడా ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి సమ్మె గురించి ఈ విధంగా మాట్లాడడం తెలంగాణ ఆందోళనకారులకు కాస్త ఆగ్రహం తెప్పించే విషయమే.అయినప్పట్టికీ ఆయన ధైర్యంగా మాట్లాడారని అనుకోవాలి.కాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కేశవరావు వంటి నేతలు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వెంకటరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడడం కూడా ఆసక్తికరంగా ఉంది.

సిఎం, టి-ఎంపిలు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు..

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలపై ఎదురుదాడి చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించిన కిరణ్ కుమార్ రెడ్డి ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీని కలిసి తాజా పరిణామాలన్నటిని తెలియచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు కొందరు తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ఆందోళనలలో పాల్గొనడం, చట్ట విరుద్దంగా రైల్ రకో ఆందోళనలో పాల్గొనడం, వద్దని చెప్పినా వినకుండా ఆందోళన కార్యక్రమాలలో చురుకుగా ఉండడం, అరెస్టు అయితే అక్రమ అరెస్టులు అని తప్పుడు ప్రచారం చేస్తుండడంవల్ల పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తున్నదని కిరణ్ వారికి వివరిస్తున్నారు. సకల జనుల సమ్మెకు వీరు మద్దతు ఇచ్చిన తీరు, సమ్మెలలో ఉన్నవారిని ఒక్కొక్కరిని దారిలోకి తెచ్చుకున్న వైనంపై ఆయన అధిష్టానానికి వివరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలను కట్టడి చేయవలసిన అవసరం ఉందని ఆయన కేంద్ర నేతలకు వివరించారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేయబోతున్నామని ప్రకటించారు. వారు ఎంతవరకు తమ వాదన వినిపించా...

3డి సినిమాలో అల్లరి న‌రేష్‌

చిత్రం
కామెడీ చిత్రాల హీరోగా పేరు సంపాదించుకున్న అల్లరి న‌రేష్ త్వర‌లో ఓ 3డి చిత్రంలో న‌టించ‌నున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రాన్ని ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బిందాస్, అహ నా పెళ్లంట చిత్రాలను నిర్మించి, ఇటీవల విడుదలైన ‘దూకుడు’కి ఓ నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర నిర్మిస్తున్నట్టు స‌మాచారం.పక్కా సోషల్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో నలుగురు హీరోలుంటారు. ఆ నలుగురిలో అల్లరి నరేష్ ప్రధాన భూమిక పోషించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం మంచి కథ సిద్ధం చేశామని, నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తామని నిర్మాత పేర్కొన్నారు.

తెలంగాణ ప‌రిష్కారానికి ఇదే మార్గమా..?

చిత్రం
కేంద్ర ప్రభుత్వం , కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నది. తాజాగా మళ్లీ అభివృద్ది ప్యాకేజీ లను ఇవ్వాలన్న ప్రతిపా దనను పరిశీలిస్తున్నదని కధనాలు వస్తు న్నాయి.దీనిని శాశ్వత పరిష్కారం అని ప్రకటించకుండా, మధ్యంతర ప్యాకేజీగా ప్రకటిస్తారు. దీని ప్రకారం కేంద్రం ప్రకటించే అభివృద్ది ప్యాకేజీలో నిధులు సగం తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయడానికి కేటాయిస్తారు.మిగిలిన సగం నిధులను కోస్తా, రాయల సీమలకు కేటాయిస్తారు. ఈ నిధుల ఖర్చుకు అన్ని పార్టీలతో కూడా ప్రతినిధులతో కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ పర్యవేక్షణలో నిధులను వ్యయం చేయాలని ఈ ప్రతిపాదన చెబుతోంది. దీనిపై ముఖ్యమంత్రి, పిసిసి అద్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారని ఎఐసిసి వర్గాలు వెల్లడిస్తున్నాయని కధనాలు వస్తున్నాయి.అయితే దీనితో తెలంగాణ సమస్య పరిష్కారం అయిపోయినట్లు కాదని, అయితే కొంత ఉపశమనం కలిగించడమే దీని ఉద్దేశమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నప్పట్టికీ, ముందుగా దీనిని అమలు చేస్తే ప్రయోజనం కనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ...

కేకే బృందంతో ర‌హ‌స్య చ‌ర్చలు..

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో ఉన్నసమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరితో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నాయకత్వంలోని బృందంతో చర్చలు జరుపుతోంది. ఇరు ప్రాంతాల నాయకులతో ఒక అవగాహన కుదర్చడం కోసం అధిష్టానం గట్టి ప్రయత్నం చేస్తోంది.కాని ఇరు ప్రాంతాల నేతలు తమ,తమ వాదనలకు కట్టుబడి ఉండడంతో సమస్య ఒక కొలిక్కి రావడం లేదు.ఈ పరిస్థితిలో ఏమి చేయాలో అధిష్టానానికి అంతుపట్టడం లేదు. మరి రహస్య చర్చలు ఏమైనా ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకువస్తాయా అన్నది చూడాలి.కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ను కలిసి సకల జనుల సమ్మె తదితర అంశాలపై వివరణ ఇస్తున్నారు.

విశాలాంధ్ర మ‌హాస‌భ‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాలాంధ్ర మహాసభ నిర్వహించ తలపెట్టిన వర్క్ షాప్ కు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. జూబ్లి హాలులో ఈ మహాసభ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితం పరకాల ప్రభాకర్ ప్రకటించారు.మీడియా సమావేశంలోనే రభస సృష్టించడానికి కొందరు ప్రయత్నించారు.పోలీసులు జోక్యంతో అది సద్దుమణిగింది. ఏకంగా వర్క్ షాప్ అంటే వచ్చే సమస్యలు,కొందరు తెలంగాణ వాదులు మళ్లీ ఉద్రిక్తత సృష్టించడానికి అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సర్దుకుంటున్నాయని, అలాగే సమ్మెలు తగ్గుతున్నాయని భావిస్తున్న తరుణంలో భావోద్వేగాలు పెరిగేలా సదస్సు నిర్వహించడం మంచిదికాదని పోలీసులు అభిప్రాయపడి అనుమతి నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కేవలం తెలంగాణవాదానికి సంబంధించిన సదస్సులకు మాత్రం అనుమతి ఇచ్చి,రెండోవాదానికి అవకాశం ఇవ్వకపోవడం కాస్త ఇబ్బంది కరమే అయినా పరిస్థితులను బట్టి పోలీసులు వ్యవహరించారని అనుకోవాలి. అంతేకాక తెలంగాణ రాష్ట్రం కోరుకునే వారు మరో వాదన హైదరాబాద్ లో వినిపించకూడదని భావించడం కూడా ప్రజాస్వామ్యయుతంగాదు. అయినా ఇప్పుడు ఎవరూ ఏమీ అనల...