పోస్ట్‌లు

అవిశ్వాసం.. ఎవ‌రికి ప‌రీక్ష‌..?

చిత్రం
రాష్ట్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెడితే పరిణామాలు ఎటా ఉంటాయన్నదానిపై ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధంగా ఆలోచిస్తోంది.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అవిశ్వాస తీర్మానం పెడితే అది కాంగ్రెస్ ,టిడిపిలకు పరీక్ష అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అవిశ్వాసాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా పెడితే అప్పుడు జగన్ క్రియాశీలకం అయి ,ప్రభుత్వాన్ని పడగొ్ట్టడానికి ప్రయత్నిస్తారని అప్పుడు కాంగ్రెస్ కు ఇరకాటం ఏర్పడుతుందని వీరు అబిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అవిశ్వాసం వీగిపోతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో మాచ్ ఫిక్సింగ్ చేసుకుందన్న విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుందని వారు అంటున్నారు. రెండు రకాలుగాను అటు కాంగ్రెస్ , ఇటు టిడిపిలకు అది ఇబ్బంది కలిగించేదేనని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు అయితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు పరీక్ష కాదా అనిఅడిగితే తమకు ప్రస్తుతం ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బహిరంగంగానే కనబడుతుందని,వారితోపాటు మరికొందరు కనుక అవిశ్వాసానికి మద్దతు ఇస్తే అప్పుడు తమకు ప్రయోజనం నెరవేరుతుందని, అలా కాని పక్షంలోతమ...

అధికారం ఇస్తే ప్రధానిని ఉరితీయిస్తా..

చిత్రం
తనకే అధికారం ఉంటే.. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధానమంత్రిని కరెంటు స్తంభానికి కట్టి ఉరితీయించేవాడినని భారత కమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.నారాయణ అన్నారు. చోడవరంలో శనివారం సీపీఐ 21వ జిల్లా మహాజన సభలో ఆయన మాట్లాడుతూ, బడా సంస్థలకు కొమ్ముకాస్తూ కేంద్రం గిరిజ నులను, మత్స్యకారులను, ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందన్నారు. బాక్సైట్, చైనాక్లే గనులకు అనుమతి ఇవ్వడంతోపాటు వాల్‌మార్ట్ వంటి సంస్థలను దేశంలోకి రానిస్తున్న ప్రధానమంత్రిని, తనకేగాని అధికారం ఉంటే ఉరి తీయించే వాడినన్నారు. బెంగాల్‌లో 34ఏళ్ల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోయడానికి సహకరించిన మావోయిస్టులు ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారన్నారు. మావోయిస్టు నేత కిషన్‌జీని బెంగాల్ ప్రభుత్వమే హత్య చేయించిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఇత‌నే.. కిష‌న్‌జీ..!

చిత్రం
ముఫ్పై అయిదు సంవ‌త్సరాల పాటు ఉద్యమ జీవితంలో గ‌డిపి మావోయిస్టు పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగిన మ‌ల్లోజుల కోటేశ్వర‌రావు ఆలియాస్ కిష‌న్‌జీ.. ఆయ‌న ఎన్నోసార్లు మీడియాతో మాట్లాడారు, టివీల్లో క‌నిపించారు.. కానీ ఆయ‌న మొహం మాత్రం క‌నిపించ‌లేదు.. మొహ‌న్ని ఓ ట‌వ‌ల్‌తో క‌ప్పేసుకుని కెమెరాల‌కి త‌న వీపు చూపిస్తూ మ‌ట్లాడే కిష‌న్‌జీ ఫోటోని 2009 అక్టోబ‌ర్ 22న హిందూస్తాన్ టైమ్స్ ప‌త్రిక ఫోటోగ్రాఫ‌ర్ సుభేందు ఘోష్ ర‌హ‌స్యంగా కిష‌న్‌జీని త‌న కెమెరాలో బంధించారు. ఇప్పటి వ‌ర‌కూ  ఈ ఫోటో బ‌య‌టికి రాలేదు.. కిష‌న్‌జీ ఎన్‌కౌంటర్ త‌ర్వాత  ఫోటో వెలుగులోకి వ‌చ్చింది.. ఈ ఫోటోకి మీడియాలో ఎంతో ప్రాచుర్యం ల‌భిస్తోంది.. కిష‌న్‌జీ ఆంధ్రప్రదేశ్‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లా వాస అని తెలిసిందే..

క‌బ్జా కేసులో సినీ నిర్మాత అరెస్టు..

చిత్రం
తెలుగు సినిమా ప‌రిశ్రమ‌లో నిర్మాత‌లుగా మంచి పేరు సంపాదించిన కొంద‌రు నిజ జీవితంలో మాత్రం విల‌న్లుగా పేరు సంపాదిస్తున్నారు. మాఫియాతో దోస్తీ చేయ‌డం, భూ కుంభ‌కోణాల‌లో ఇరుక్కోవ‌డం, రియ‌ల్ ఎస్టేట్ పేరుతో ప్రజ‌ల‌ను మోస‌గించ‌డం లాంటివి త‌ర‌చూ వెలుగు చూస్తున్నాయి. గ‌తంలో ఇలాంటి కేసుల‌లోనే నిర్మాత‌లు సింగ‌ణ‌మ‌ల ర‌మేష్‌, సి. క‌ళ్యాణ్‌లు ఇరుక్కోగా తాజాగా వారికి జ‌త‌గా మ‌రో నిర్మాత చేరిపోయాడు. ఎల్లారెడ్డిగూడలో ఓ భూకబ్జా కేసుకు సంబంధించి సినీ నిర్మాత వల్లభనేని అశోక్ సహా 11మందిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారిని సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సినిమా ప‌రిశ్రమ‌లో నిల‌దొక్కుకోవ‌డానికి, భారీ సినిమాలు తీసి మెగా ప్రొడ్యూస‌ర్ అనే పేరు సంపాదించుకోవ‌డానికి కొంద‌రు నిర్మాత‌లు ఇలా అక్రమ ప‌ద్దతుల‌లో డ‌బ్బులు కూడ‌బెట్టుకోవ‌డానికి ప్రయ‌త్నించ‌డం విచార‌క‌రం..

మళ్ళీ టెర్రర్ ఎటాక్ ! తట్టుకోగలమా?

చిత్రం
మ‌ళ్ళీ టెర్రరిస్టులు ఎటాక్ చేస్తే మ‌నం త‌ట్టుకోగ‌ల‌మా..?  ముంబాయి త‌ర‌హా కాల్పుల‌కి ఎగ‌బ‌డితే మ‌నం భ‌రించ‌గ‌ల‌మా..? ఒకేసారి మూకుమ్మ‌డిగా దేశంలోని అన్ని ప్రధాన న‌గ‌రాల‌లో ఇలాంటి అఘాయిత్యాల‌కి టెర్ర‌రిస్టులు పాల్ప‌డితే అరిక‌ట్ట‌గ‌ల‌మా…? పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై పంజావిసిరి నేటికి సరిగా మూడేళ్లు. దేశ అంతర్గత భద్రతకే సవాల్ గా మారిన ఈ తరహా దాడులు మరోసారి జరిగితే మనదేశం తట్టుకోగలదా? సమర్థవంతంగా తిప్పికొట్టగలదా? అసలు పౌరుల రక్షణకు పాలకులు తీసుకుంటున్న చర్యలేమిటి? నిఘానేత్రాల కళ్లుగప్పి, చీకటివేళ సముద్రమార్గంగుండూ ముంబయితీరానికి చేరి ముష్కరమూకలు మహావిధ్వంసం సృష్టించడంతో దేశం ఉలిక్కిపడింది. అప్పటి నుంచీ ఇప్పటివరకు కేసు దర్యాప్తులో ఏమేరకు ప్రగతి సాధించగలిగాం? ఉగ్రవాదుల దాడులకు ముంబయి వణికిపోయి నేటికి సరిగా మూడేళ్లు.  ముంబయి నగరవాసుల్లోనే కాదు, ఏకంగా దేశ ప్రజల్లోనే భద్రతపై నమ్మకంపోయిన రోజు. కన్నీట మసకబారిన కళ్లతో జాతి ఏకమైన రోజు అది. ఉగ్రవాదాన్ని అంతమొంది...

ఎన్‌.టి.ఆర్ ఫాలోవ‌ర్ నాగం

చిత్రం
ఎన్.టి.రామారావు ఏదైనా మాట చెబితే దానికి కట్టుబడి ఉండేవాడని, ఎప్పుడూ వెనక్కి తగ్గేవారు కారని ,అలాగే తాను కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిపైనే నిలబడతానని అంటున్నారు. డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి పట్టుబట్టి తాను శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాను ఆమోదింప చేసుకున్నారు. అయితే దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన ఈ సమాధానం చెబుతున్నారు. తాను నిజమైన ఎన్.టి.ఆర్. అనుచరుడినని ఆయన చెబుతున్నారు. అంటే దానర్ధం మిగిలినవారు కారనా అంటే ఆయన ముసిముసి నవ్వుతున్నారు. విశేషం ఏమిటంటే 1995లో తెలుగుదేశంలో సంక్షోభం వచ్చినప్పుడు డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి కూడా ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా చంద్రబాబు పక్షాన నిలబడ్డారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణ అంశం పై పార్టీలో వివాదపడేవరకు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు ఆస్తుల కేసు వచ్చినప్పుడు కూడా నాగం తన వ్యాఖ్యలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం విశేషం. తెలంగాణ అంశం తప్ప మిగిలిన వాటిలో తనకు పార్టీతో తగాదా లేదని అంటున్న...

బాబు ద్విముఖ వ్యూహం

చిత్రం
ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు తన ఆస్తుల కేసులో ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు.ఒకవైపు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వేసిన పిటిషన్ లో పేర్కొన్న అంశాలన్నీ అసత్యాలేనని విస్తారంగా ప్రచారం చేయించడం, మరోవైపు కోర్టుల ద్వారా పోరాటం చేయడం అనే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నట్లు కనబడుతుంది. సుప్రింకోర్టుసూచన మేరకు చంద్రబాబు, లోకేశ్వరి, లోకేష్ లు హైకోర్టులో తమ వాదనలు వినాలంటూ పిటిషన్ వేయడం ఒక కోణం కాగా, మరో వైపు విజయమ్మ వేసిన పిటిషన్ లోని అంశాలను ఒక్కొక్కదానిని ఖండిస్తూ , తమ పార్టీ నేతలతో ప్రచారంలో పెట్టడం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ వరస క్రమంలో రోజూ కొంతమంది టిడిపి సీనియర్ నాయకులతో విజయమ్మ పిటిషన్ లోని అంశాలపై సమాధానం ఇప్పిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు ఇ. పెద్దిరెడ్డి శుక్రవారం నాడు తాము విజయమ్మపై పరువు నష్టం వేసే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నామని ప్రకటించం కూడా ఇందులో భాగంగానే భావించాలి.విజయమ్మ అన్ని అసత్యాలతో పిటిషన్ వేశారని ,అందువల్ల తాము పరువు నష్టం దావా వేస్తామని ...