పోస్ట్‌లు

వేపపళ్లతో వ్యాపారం, ఓ ఆట

చిత్రం
ప్రసాద్ తుర్లపాటి చక్కని విషయం గుర్తుచేశారు. జొన్న కాండం ఎండితే దాన్ని చొప్ప అంటారు. అది చాలా పెళుసుగా ఉంటుంది. ఒక కణుపు నుంచి మరో కణుపు వరకు విరగ్గోడితే, గోరుతోనే చొప్ప దంటు పై భాగాన్ని నాలుకబద్దల్లా విడగొట్టవచ్చు. అప్పుడు లోపల తెల్లటి బెండు ఉంటుంది. అదే సాప్ట్ గా ఉండే మేటిరియల్. గుండ్రటి స్తంభాల్లా ఉండే ఈ బెండునీ, నాలుకబద్దల్లా వచ్చే పై పొలుసులను వాడుతూ మేమంతా సమ్మర్ లో రావులపాడు వెళ్ళినప్పుడు చిన్నసైజు బండి, నాగలి, ఫ్యాన్ వంటి బొమ్మలు చేసేవారం. అదో సరదా. అంతేకాదండోయ్. ఎండాకాలం పండిన వేపపళ్లు చెట్టుమీద నుంచి రాలి కింద పడితే వాటిని ఏరుకుని సరదాసరదాగా మామిడిపళ్ల వ్యాపారం (వేపపళ్లతో) చేసేవాళ్లం. వేపపళ్లు కాస్తంత తియ్యగా ఉంటాయి. ఎప్పుడైనా తిన్నారా ? వేపపళ్లు తింటే పిచ్చి రాదు , ఇదీ నా గ్యారంటీ. తియ్యటి గుజ్జుతో తింటుంటే భలే గమ్మత్తుగా ఉంటాయి. కాస్తంత చేదుకూడా కలుస్తుంది. ఇలా తినడం వల్ల కడుపులోని నులిపురుగులు పోతాయని మా అమ్మ (స్వరాజ్యలక్ష్మి) చెబుతుండేవారు. ఇలా సమ్మర్ లో వేపపళ్లతో వ్యాపారం ఆట ఆడటంవల్ల మాకు బోలెడంత కాలక్షేపం. పైగా నాలెడ్జీ (వ్యాపారం ఎలా చేయాలన్న) వచ్చేసిందని నమ్మేశం. అల...
చిత్రం
ప్రియమైన మిత్రులారా… వృత్తి పరంగా మార్పులు రావడం సహజమే. ఈ మధ్య అనారోగ్యం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత నేను తిరిగి నా జర్నలిజం కెరీర్ పై దృష్టిపెట్టాను. ఈ మార్పులు సంభవిస్తున్న కాలంలోనే నా కెరీర్  మలుపు తిరిగింది.  (పైన రాసిన లేఖ, తరంగ మీడియా చైర్మన్ మోహన్ మురళీధర్ గారు రాసింది) ప్రవాసఆంధ్ర మిత్రులు అందించిన ప్రోత్సాహంతో నేను తరంగ మీడియాలో న్యూస్ అండ్ ప్రొగ్రాం డైరెక్టర్ గా చేరాను. అంతవరకు టివీ 5 న్యూస్ ఛానెల్ లో పనిచేస్తూ ఎంతో మంది మిత్రుల ఆత్మీయఅనుబంధాన్ని పెంచుకున్నాను. దీనికంటే ముందు తెలుగువన్.కామ్, అలాగే, ఆంద్రప్రభ, ఇంకా వెనక్కి వెళితే ఈనాడు (1983)లో ఎంతో మంది మిత్రులతో కలిసిపనిచేసే భాగ్యం లభించింది. అలాగే, ఆకాశవాణితో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మరువలేనిది.   ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మిత్రులే నాకున్న నిజమైన బలం. వారిందిస్తున్న ప్రోత్సాహంతోనే ఇప్పుడు నేను  రేడియో తరంగ (ఆన్ లైన్ రేడియో)లో సోమవారం నుంచీ శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచీ 9 గంటల వరకు వార్తా విశ్లేషణ కార్యక్రమాన్ని లైవ్ షోగా ఇస్తున్నాను. ఈ లింక్ లు చూడండి… http://tharangamedia.com/ http://thar...

నారాతో జూ.ఎన్టీఆర్ వార్ ?

 జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవుతున్నారా?  బాబు, జూ.ఎన్టీఆర్ మధ్య అంతరం పెరిగిపోతున్నదా?  ఎన్టీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా?    2009 ఎన్నికల ప్రచారంలో మామయ్య చంద్రబాబుకు ఎంతో అండగా ఉన్న యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నెమ్మదిగా దూరమవుతున్నారా? బాబాయ్ బాలకృష్ణను, మామ చంద్రబాబును ఎంతో ఇష్టపడిన జూనియర్ ఎన్టీఆర్, ప్రచారఘట్టంలోనే ప్రయాణంలో తీవ్రగాయపడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేన్ ఫెస్టోలో ఉన్న నగదు బదలీ పథకాన్ని ఆకాశానికి ఎత్తేశాడు జూనియర్ ఎన్టీఆర్.  2009 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాకపోవడంతో కాస్తంత నిరుత్సాహపడిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సాంతం టిడిపీకి దూరంగా జరిగిపోయారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.  కాస్త ఉప్పందితేచాలు హడావుడి చేసే ఛానెళ్లు ఈ విషయంపై ఇప్పటికే ప్రత్యేక కథనాలతో ఊదరగొట్టాయి. ఎస్ఎంఎస్ పోల్స్ కూడా నిర్వహించాయి. ఈ మధ్య సంక్రాతి సంబరాలకు బాలయ్య తన వియ్యంకుడైన నారా చంద్రబాబు సొంతఊరు నారావారి పల్లెకు వెళ్లారు. ఈ పర్యటనను కేవలం ఫ్యామిలీ ఫంక్షన్ గానే చూడట...

సూర్యుడికి భూమి ద‌గ్గర‌య్యింది..

చిత్రం
ఈరోజు సూర్యుడిని గమనించారా? రోజూ కంటే మరింత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు కదూ! ఎందుకంటే.. నేడు ‘పెరిహీలియన్ డే’ మరి. అంటే భూమి సూర్యుడికి అత్యంత సమీపదూరంలోకి వచ్చే రోజన్నమాట. ఏటా జనవరిలో మాత్రమే ఈ దృగ్విషయం చోటుచేసుకుంటుందని బుధవారం ఢిల్లీలోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రఘునందన్ కుమార్ వెల్లడించారు. ‘సాధారణంగా గ్రహాలు, గ్రహ శకలాలన్నీ సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. భూగ్రహం కూడా ఇలా కక్ష్యలో తిరుగుతూ ఏడాదికి ఒకసారి సూర్యుడికి అతిదగ్గర బిందువు (పెరిహీలియన్) వద్దకు, మరోసారి ఏటా జూలైలో అతిదూరపు బిందువు(అప్‌హీలియన్) వద్దకు చేరకుంటుంది’ అని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం 5:53 గంటలకు భూమి పెరిహీలియన్ బిందువు వద్దకు చేరుకుంటుందని, ఆ సమయంలో సూర్యుడికి, భూమికి మధ్య దూరం అతితక్కువగా 147 మిలియన్ల కిలోమీటర్లు(14.70 కోట్ల కి.మీ.) మాత్రమే ఉంటుందన్నారు. అయితే సూర్యుడు దగ్గరగా వచ్చినప్పటికీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవని, భూమి ఉష్ణోగ్రతలు సూర్యుడి దూరం మీద కాకుండా భూ అక్షం ఉన్న కోణం మీద ఆధారపడి ఉంటాయని...

సాయిరెడ్డి విచార‌ణ‌ షురూ

చిత్రం
జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని గురువారం ఉదయం సీబీఐ అధికారులు చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ని దిల్ కుషా అతిథిగృహంలో సీబీఐ విచారించనుంది. విజయసాయిరెడ్డిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతిరోజు విచారణ పూర్తి అయిన వెంటనే చంచల్‌గూడ జైలుకి తరలించాలని కోర్టు తీర్పులో వెల్లడించింది.

సెంచ‌రీ.. డ‌బుల్ సెంచ‌రీ.. ట్రిబుల్ సెంచ‌రీ..

చిత్రం
ఇది మూడు ముచ్చట‌గా మూడు మ్యాచుల్లో న‌మోదు అయిన స్కోరు అనుకునేరు.. కాదు.. సిడ్నీలో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ తొలి ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. క్లార్క్ కెరీర్ లో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ. ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో ఏడో ప్లేయర్‌గా క్లార్క్‌ నమోదయ్యాడు. క్లార్క్‌ 38 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 314 రన్స్‌ చేసి అజేయంగా నిలిస్తే, మైక్‌ హసీ 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 121 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 615 పరుగుల భారీ స్కోరు చేసింది. దాంతో ఇండియాపై 421 రన్స్‌ కీలక ఆధిక్యం ఆసీస్‌కు దక్కింది. కాగా భారీ స్కోరు ఛేధించ‌డానికి బ‌రిలోకి దిగిన టీమిండియా సెహ్వాగ్ (4) రూపంలో భారీ వికెట్‌ని కోల్పోయింది. దీంతో విజ‌యం మాట దేవుడెరుగు.. డ్రా దిశ‌గా అయినా మ‌న బ్యాట్స్‌మెన్ క‌స‌ర‌త్తు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది.

వైకుంట ఏకాద‌శి విశిష్టత‌

చిత్రం
ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి) అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులను విశేషదాయకంగా పరిగణిస్తాము. అవి: ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి) కార్తీక శుద్ధ ఏకాదశి పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి) మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. ఒక చిన్న స్థలం ఉంటే తూర్పు దిక్కుగా నిలుచుంటే దానికి నిట్టనిలువుగా తూర్పు పశ్చిమాలు, అడ్డంగా ఉత్తర దక్షిణాలూ వుంటాయి. ఈ ఉత్త్తర దక్షిణ విభాగాన్ని ప్రాచీనులు కేవలం ప్రదేశాలకి మాత్రమే పరిమితం చేయకుండా కాలంలోనూ, శరీరంలోను కూడా ఈ విభాగాన్ని చేశారు. కాలంలో ఉత్తరం పగలు; దక్షిణం రాత్రి కుడి చేయి దక్షిణం; ఎడమ చేయి ఉత్తరం ఎక్కడైనా (ఉత్తర – దక్షిణాలలో) ఉత్తరమే పవిత్రమైనది, శ్రేష్టమైనది. దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అన్నారు. దక్షిణాయనం వెళుతుండగా చీ...