అన్ని వార్తలు ఒకలా ఉండవు
indian News,India Latest News | News, Hollywood news, Bollywood news, political satires,Movie News, News Portal, Music, Movie News, Hollywood,
IT news portal providing latest Information Technology news
ఈ భూమికి ఏమీ కాదు... సరదాగా కేసేపు నవ్వుకోండి...
లింక్ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్లు
సరదాగా కాసేపు నవ్వుకోండి. ... ఎందుకింత టెన్షన్...ఈ భూమికి ఏమీ కాదులెండీ.. ఇది చూడండి...
హమ్మయ్యా...నవ్వుకున్నారా...థాంక్స్....మళ్ళీ ఇలాగే మీ ముందుకు వస్తా....
ఈ శతాబ్దం నాదీ అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీకి ఒక శతాబ్దం నిండింది. మహాకవి 101వ జయంతి (శనివారం- 30-04-11) వేడుకల సందర్భంగా ఓసారి ఆ మహాకవిని స్మరించుకుందాం. .. కవితా మహర్షి మరో శతాబ్దిలోకి తన చైతన్యకాంతులను ప్రసరింపజేస్తున్నాడు. పాత పదాలకు కొత్త అర్థం కల్పించి కవిత్వానికి దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ . `ఆధునిక కవిత్వం అర్థంకాలేదంటే, ఆధునిక జీవితమే అర్థం కాలేదన్నమాట' అంటూ మోడర్న్ భావాలకు పెద్దపీట వేసిన దీర్ఘదర్శి మహాకవి శ్రీశ్రీ. అందుకేనేమో `పదండిముందుకు, పదండి తోసుకు '- అంటూ మరో ప్రపంచాన్ని ముందస్తుగానే చూపించాడు శ్రీశ్రీ. `రాబోవు యుగం నా యుగం అవుతుంది' అంటూ శాసించిన మహాకవి శ్రీశ్రీ. 1930 వరకు తెలుగుసాహిత్యం తనను నడిపిస్తే, ఆ తరువాత దాన్ని తానే నడిపించానంటూ సగర్వంగా చెప్పుకున్నవాడు శ్రీశ్రీ. అనతికాలంలోనే మహాకవిగా ఎదిగి తెలుగుసాహిత్యంలో మధ్యాహ్న భానుడిలా ప్రకాశించాడు శ్రీశ్రీ. `శ్రీశ్రీకంటే మిన్న- ఏదైనా వుంటే, అది శ్రీశ్రీ కవితే సుమా'- అన్నంతగా శ్రీశ్రీ కవితలు జనహృదయాల్లో నాటుకుపోయాయి. `భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను... స్మ...
దోమల శృంగారంపై పూర్తి అవగాహన ఉంటే, డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా, నిజమేనంటున్నారు అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలోని జీవరసాయన శాస్త్రవేత్తలు. ఆడెస్ ఈజిప్టీ దోమల సెక్స్ లో ఒక రకమైన రసాయన చర్యల పట్టికను శాస్త్రవేత్తలు గుర్తించారు. మగదోమ స్పెర్మ్ లో ఉండే వంద రకాల ప్రొటీన్లు ఆడదోమల్లోని లక్షణాల్లో శాశ్వత ప్రాతిపదికన మార్పులు తీసుకువస్తాయి. అవి ఆహారం (రక్తం) తీసుకునే విషయంలోనూ, అండాలను విడుదల చేయడంలోనూ, కలయక పద్ధతుల్లోనూ ఈ మార్పులు కొట్టొచ్చినట్టు కనబడతాయట. మగ దోమల్లో అంతకు ముందు కూడా కొన్ని రకాల ప్రొటీన్లు గుర్తించినా, సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఏ తరహా ప్రొటీన్లు ఆడదోమలోకి స్పెర్మ్ ద్వారా పోతున్నాయో ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. ఈ ప్రొటీన్లను స్పష్టంగా గుర్తించడం వల్ల రాబోయే కాలంలో ఆడ దోమలు పుట్టకుండా చేయడానికి వీలుచిక్కుతుందనీ, అప్పుడు డెంగ్యూ, వెస్ట్ నిలే వంటి వైరస్ ల వల్ల మనుషుల్లో జ్వరాలు రాకుండా చూడవచ్చని కార్నెల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు సంగతేమిటం...
జపాన్ లో అణువిద్యుత్ కేంద్రాలు ఒకొటొకటిగా పేలిపోతున్నాయి. దీంతో ప్రమాదకర స్థాయిలో రేడియేషన్ దూసుకువచ్చేస్తోంది. ఇది ప్రస్తుతానికి అమెరికా వైపు వెళుతున్నట్టు చెబుతున్నా, మనదేశానికి కూడా ముప్పు రావచ్చనే అంటున్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో వర్షం పడితే, రైన్ కోట్, రైన్ హ్యాట్ లేకుండా బయటకు వెళ్లవద్దంటూ సెల్ ఫోన్లలో సంక్షిప్త సందేశాల రూపంలో హెచ్చరికలు కనిపిస్తున్నాయి. జపాన్ లోని టోక్యో దగ్గర ఇప్పటికే, 400 మిల్లీసీవెర్ట్స్ మేరకు రేడియేషన్ వ్యాప్తి చెందుతోంది. ఇది సాదారణ స్థాయికంటే, తొమ్మిది రెట్లు ఎక్కువ. ఈ స్థాయి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. 350 మిల్లీ సీవెర్ట్స్ స్థాయిలో ఉంటే, ఆ ప్రాంతంలోని జనవాసాలను ఖాళీ చేయించాలని ప్రపంచ న్యూక్లియర్ అసోసియేషన్ చెర్నోబిల్ సంఘటన తరువాత హెచ్చరించింది. జపాన్ లో ప్రస్తుతానికి ఆ స్థాయి దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో అణుధార్మికత మనుషులపై ఎలాంటి దుష్ప్రభావం కలిగిస్తుందో చూద్దాం... మానవాళిని నరనరాన తినేసే మహమ్మారి అణు ధార్మికత. దాదాపు ఆరున్నర దశాబ్దాల క్రితం… జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకిలలో… అమెరికా పేల్చిన అణుబ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి