బర్నింగ్ కామెంట్రీ - 7
`వన్డే'మాతరం!
కప్పుకొచ్చింది ఆట
వేలకోట్ల బెట్టింగ్ ల సై ఆట
`పిచ్'ముదిరి పాకానపడినట్టు
లక్షన్నరపైనే బ్లాక్ లో టిక్కెట్ల వేట
ప్రకటనల ధర సెకెండ్ కు
20 లక్షల పైమాటేనట..
మనలోమాట..
సామాన్యునికి వొరిగిందేంటట?!
మేరా భారత్ మహాన్ అనే
ఈ జాతీయతత్వం
భిన్నత్వంలో ఏకత్వంలా రగిలే పౌరషాగ్ని
కానరాదేం మరే విషయంలోనూ?
ఈ జాతీయతత్వపు ఆరాటం?!
రకరకాల ఇజాల, ఇంద్రజాలాల నేపథ్యంలో
కొడిగట్టుకుపోయిందా? వందేమాతరం?!
అవును -
నేడది మిగిలింది ఇలా....
`వన్డే'మాతరంలా...?!
-నీల్ కొలికపూడి
కప్పుకొచ్చింది ఆట
వేలకోట్ల బెట్టింగ్ ల సై ఆట
`పిచ్'ముదిరి పాకానపడినట్టు
లక్షన్నరపైనే బ్లాక్ లో టిక్కెట్ల వేట
ప్రకటనల ధర సెకెండ్ కు
20 లక్షల పైమాటేనట..
మనలోమాట..
సామాన్యునికి వొరిగిందేంటట?!
మేరా భారత్ మహాన్ అనే
ఈ జాతీయతత్వం
భిన్నత్వంలో ఏకత్వంలా రగిలే పౌరషాగ్ని
కానరాదేం మరే విషయంలోనూ?
ఈ జాతీయతత్వపు ఆరాటం?!
రకరకాల ఇజాల, ఇంద్రజాలాల నేపథ్యంలో
కొడిగట్టుకుపోయిందా? వందేమాతరం?!
అవును -
నేడది మిగిలింది ఇలా....
`వన్డే'మాతరంలా...?!
-నీల్ కొలికపూడి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి