మహిళల్ని చితకబాదిన పోలీసులు

విజయనగరం కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న ఆశాకార్యకర్తలపై పోలీసులు దాడి చేశారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉదయం నుంచి కలెక్టరేట్ ముందు ఆందోళన చేసిన దాదాపు వందమంది మహిళలపై విజయనగరం పోలీసులు తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. పాపం మహిళలపై అక్కడే ఉన్న లేడీపోలీసులు కాకుండా స్థానిక సీఐ, ఎస్సైలతో పాటు మగపోలీసులంతా తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ ఘటనతో ఐదుగురు ఆశాకార్యకర్తలకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతుండగా, మిగతావారికి తీవ్రమైన గాయాలయినట్లు సమాచారం. ఈ సన్నివేశాన్ని టివిల్లో ప్లే అవడంతో మహిళాసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కారకులైన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి , జరిగిన ఘటనపై విచారణ చేపట్టాలని మహిళానేతలు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌లు