వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ లోకి వల్లభనేని వంశి?



విజయవాడ తెలుగుదేశం అర్బన్ అద్యక్షపదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశి వై.ఎస్,ఆర్ కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని రాజకీయవర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయా టీవీఛానళ్లలో కధనాలు కూడా రావడం ఆరంభమైంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణలతో కలిసి ఈయన జగన్ పార్టీలోకి వెళ్లవచ్చని అంటున్నారు. దీనికి ప్రాతిపదికగా, గతంలోనే వై.ఎస్.జగన్ ను వంశీ కలసారని, అందుకే పెద్ద సమస్యగాని అంశంలో సమస్యను సృష్టించి పార్టీని వదలడానికి వంశి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న నమ్మకంతో వంశి ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. హరికృష్ణకు టిడిపి జిల్లా అద్యక్షుడు దేవినేని ఉమా అవమానం చేశారని, ఆరోపించడం, మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో మాచ్‌ పిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించడం వంటివి ఇందులోభాగమని అంటున్నారు. అయితే మరో వాదన కూడా ఉంది. దేవినేని నెహ్రూ వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ లోకి వెళితే ఆయనకు విశేష ప్రాదాన్యత వస్తుందని, దీనిని అరికట్టడం కోసం వంశి ఈ ఎత్తుగడ వేశారా అన్న ప్రచారం కూడా లేకపోలేదు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!