సత్యసాయి బాబా ఆరోగ్యం క్షీణించిందా?

   పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారి ఆరోగ్యం క్షీణించిందంటూ వచ్చిన వార్తలు శనివారం (02-04-2011) మధ్యాహ్నం కోట్లాది మంది భక్తుల్లో ఆందోళన కలిగించింది. సత్యసాయి బాబా వారి ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడంతో ప్రపంచ మొత్తంలోని పదికోట్లకు పైగానే ఉన్న బాబా భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ వార్త రాస్తున్న సమయానికి బాబావారు శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు వైద్యులు తెలియజేశారు.
 బాబావారి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ దేశవిదేశాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బాబావారి అసలు పేరు సత్యనారాయణ రాజు. అనంతపురం పుట్టపర్తిలోని ఆశ్రమంలో ఉంటూ విశ్వశాంతి కోసం తపిస్తున్న నడిచే దేవుడు ఆయన. 1948లో ప్రశాంతి నిలయం ఏర్పాటు చేశారు. ఆ తరువాత ముంబయిలో ధర్మక్షేత్రం, చెన్నైలో సత్యం శివం సుందరం ఏర్పాటు చేశారు. బాబావారి భక్తుల్లో దేశాధినేతలు, ప్రదానులు, వీవీఐపీలు ఎందరో ఉన్నారు.
  అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాబావారి ఆరోగ్యం కుదుటపడాలని మేము మనసా,వాచా, కర్మణా కోరుకుంటున్నాం. దేవదేవుడిని ప్రార్థిస్తున్నాం. మరి మీరు కూడా  ఈ ప్రత్యేక అక్షర పూజలో భాగస్వాములుకండి....



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!