చేతులెత్తేసిన మైసూరా



కడప లోక్ సభ అభ్యర్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.పార్టీ గెలుస్తందన్న భావనో, లేక సమీప ప్రత్యర్ధిగా గట్టిపోటీ ఇచ్చి తగు గుర్తింపు వస్తుందన్న నమ్మకం కలిగినా ఆయా ముఖ్యమైన అభ్యర్దులు రాజకీయ పార్టీల తరపున పోటీచేయడానికి ఉత్సాహపడతారు. ఆ పరిస్థితి అంతగా కనపడకపోవడంతో కడప లోక్ సభ ఎన్నికలలో పోటీ చేడానికి గట్టి అభ్యర్ధులు వెనకాడుతుండడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. టిడిపి రాజ్య సభ సభ్యుడు డాక్టర్ ఎమ్.వి.మైసూరారెడ్డి తనకు కడప లోక్ సభ కు పోటీచేయాలన్న ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఎవరు అభ్యర్ధి అనేది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారని కూడా అన్నారు. మామూలుగా అయితే, పార్టీ ఆదేశిస్తే పోటీచేస్తాననో, లేక పోటీకి సిద్దమనో నేతలు సంకేతాలు ఇస్తుంటారు. కాని మైసూరా తనకు ఆసక్తి లేదని చెప్పడం ద్వారా తన వైఖరిని నిర్మొహమాటంగా బయటపెట్టారని అనుకోవాలి.పార్టీకి ఉన్న ముఖ్య నేతలలో మైసూరా రెడ్డి ముఖ్యులు.పైగా జనంలో ఆయనకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. సామాజికవర్గ నేపద్యం ఉంది. గతంలో పోటీచేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి ఈమాట చెబితే పార్టీకి కూడా కాస్త అసౌకర్యమే. అయినా పార్టీ ఎవరో ఒక గట్టి అభ్యర్ధి కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటుంది. చంద్రబాబు విదేశీయానం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కడప అభ్యర్ది ఎవరన్నది నిర్ణయిస్తారు.
- కొమ్మినేని

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!