శ్రీ‌వారికీ తాకిన‌ గాలి ఎఫెక్ట్‌


గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి అరెస్టు కాస్తా ఇప్పుడు తిరుమ‌ల‌ శ్రీ‌వారికి, శ్రీ కాళ‌హ‌స్తి ప‌ర‌మేశ్వ‌రుడికి కూడా ఎఫెక్టు ప‌డింది.. ఎలాగంటారా..?  గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి తాను మైనింగ్‌లోకింగ్‌గా ఉన్న‌ప్పుడు తిరుమ‌ల శ్రీ‌వారికి దాదాపు 45కోట్ల రూపాయ‌ల వ‌జ్ర‌కిరీటాన్ని కానుక‌గా శ్రీ‌వారికి స‌మ‌ర్పించారు. అప్ప‌ట్లో ఈ వార్త పెద్ద సంచ‌ల‌నంగా మారింది. రెండేళ్ళ క్రితం గాలి సోద‌రులు తిరుమ‌ల శ్రీ వేకంటేశ్వ‌ర స్వామికీ ఈ అమూళ్య కానుక‌ని అందించారు. అయితే ప్ర‌స్తుతం అవినీతి ఆరోప‌ణ‌ల‌తో జైలుకెళ్ళిన గాలి అందించిన ఆ కానుక‌ని ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల‌ని, దానిని శ్రీ‌వారికి అలంక‌రించ‌డానికి వీళ్లేద‌ని డిమాండ్ చేస్తూ తిరుప‌తి కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. గాలి అందించిన ఆ వ‌జ్ర‌కిరీటాన్ని ఇప్ప‌టి వ‌ర‌కూ శ్రీ‌వారికి ఒకే ఒక్క‌సారి మాత్రమే అలంక‌రించారు. ఆ త‌ర్వాత దాన్ని ప‌క్క‌న పెట్టారు. మ‌రి.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల డిమాండ్‌కి త‌లొగ్గి ఆ కిరీటాన్ని చేస్తారా.. లేక శ్రీ‌వారికి కానుక‌గా ఇచ్చిన సంప‌ద‌ని తిరిగి ఎలా ఇస్తార‌ని టిటిడి వారు ఎదురు ప్ర‌శ్తిస్తారా అన్న‌ది చూడాలి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!