అజారుద్దీన్ కుమారుడు మృతి
గణేష్ నిమజ్జనోత్సవం రోజున ఒక విశాదం చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు, అయాజుద్దీన్ అతని స్నేహితుడు అద్నాన్‌లు బైక్‌రేస్‌లో పాల్గొని ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరగడంతో మృతి చెందారు. అయాజుద్దీన్, అజారుద్దీన్ మొదటి భార్య నౌరీన్ కొడుకు. వీరికి ఇద్దరు కుమారులు. అయాజ్ చిన్నవాడు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయాజుద్దీన్ కి స్కూల్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. అయాజ్ సెయింట్ మేరీ కాలేజీలో చదువుకుంటున్నాడు. అవుటర్ రింగ్‌రోడ్డు గుండా బైక్‌పై అతివేగంతో బైక్‌పై రావడంతో పుప్పాలగూడా టోల్‌గేట్ దగ్గర అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టటంతో వీరిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరికీ తలకి బలమైన గాయాలు కావడంతో వీరిని పోలీసులు అపోలో హాస్పిటల్‌కి తరలించారు. వీరు బైక్ రేస్‌లో పాల్గొని అతివేగంతో బైక్ నడపటంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు చెబుతున్నారు. వీరిని పోలీసులు తమ వాహనంలోనే అపోలో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళారు. డాక్టర్లు వీరిని బ్రతికించడం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఈ మధ్యనే బైక్ ప్రమాదంలో కోట శ్రీనివాసరావు కుమారుడు కూడా చనిపోవడం తెలిసిందే.
ఇంకా చనిపోలేదంటండి. serious గా వుందంట.
రిప్లయితొలగించండి