నేడో రేపో ఒక వీఐపీ నేత అరెస్టు
సీబీఐ కేసులో చిక్కుకున్న ఒక ప్రముఖ యువ నాయకుడ్ని ఈరోజు (10-07-11) అర్థరాత్రి దాటిన తరువాత అరెస్టు చేస్తారంటూ రాష్ట్రవ్యాప్తంగా రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. తెల్లవా రితే రాష్ట్ర రాజధానిలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ గణేష్ నిమజ్జనోత్సవం ఉంటుంది. ఇందుకోసం జంటనగరాల్లో 30వేల మంది పోలీసులను మోహరించారు. నగరం మొత్తం ఓ పద్మవ్యూ హంలా ఉంటుంది. ఇతర రాష్ట్రాల వారెవరూ అంత ఈజీగా చొరబడలేరు. వీఐపీ పర్సన్ ను అరెస్టు చేసేందుకు ఇదే మంచి సమయంగా భావిస్తున్నట్టు రూమర్స్ అందుతు న్నాయి. ఒకవేళ వీఐపీ నేతను అరెస్టు చేస్తే ఆయన జిల్లా అభిమానులు పెద్దసంఖ్యలో రాష్ట్ర రాజధానికి తరలివెళ్లే అవకాశం ఉంది. అలాంటప్పుడు అనూహ్యమైన రీతిలో ఏరకమైన విధ్వంసమైనా చోటుచేసుకోవచ్చు. అరెస్టు విషయం పోలీసులకు ముందస్తుగా సమాచారం అందినా, వారు పెద్దఎత్తున మోహరించినా ప్రజల్లో అనేక అనుమానాలు రాకమానవు. అదే, గణేశ్ నిమజ్జనం రోజున ఎలాగూ పోలీసులు బలగాలు మోహరించే ఉంటాయి. పైగా ఎటు చూసినా బ్యారికేడ్లు కడతారు. పోలీసులు కన్నుగప్పి ఎవ్వరూ లోపలకి రాలేరు. అలాగే, బయటకు పోలేరు. అంతేకాదు, నిమజ్జనం రోజున మీడియా కూడా ఎక్కువగా అటే దృష్టిపెడుతుంది. మీడియా, ప్రజలు గణేష్ నిమజ్జన విశేషాల్లో మునిగితేలుతున్నప్పుడే సదరు వీఐపీ నేతను అరెస్టు చేయవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఆ వీఐపీ నేత ఎవరన్నది ఈ వర్గాలు వెల్లడించడంలేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి