భార్యకు లైంగిక సుఖం ఇవ్వలేదా! పరిహారం చెల్లించు..


ఇదో విదేశీ వింతగా భావించాలి. భార్యభర్తల మధ్య లైంగిక సంబంధాలు లేకపోయినా పరిహారం చెల్లించాలని ఫ్రాన్స్ లోని ఒక కోర్టు ఆదేశించింది. దక్షిణ ఫ్రాన్స్ లోని ఒక కోర్టు భలే తమాషా ఉత్తర్వు ఇచ్చింది. భార్యకు లైంగిక సుఖం ఇవ్వనందుకు గాను పరిహారం చెల్లించాలని ఆదేశించడం యూరప్ లో విశేష వార్తగా మారింది.ఫ్రాన్స్ లో జీన్ లూయిస్ అనే ఏభై ఒక్క ఏళ్ల వ్యక్తి భార్య ముందుగా విడాకుల కోసం కోర్టుకు ఎక్కింది. సంసార సుఖం లేనందున తన విడాకులు మంజూరు చేయాలని కోరింది. అందుకు కోర్టు అంగీకరించి విడాకులు ఇచ్చింది. అయితే అంతటితో ఆగకుండా తనకు ఇరవై ఒక్క ఏళ్లపాటు లైగింక సుఖం లేకుండాచేసినందుకుగాను పరిహారం చెల్లించాలని మాజీ భర్తపై దావా వేసింది. ఈ కేసును విచారించిన ఒక ఉన్నత కోర్టు దీనికి అంగీకరించి 8500 పౌండ్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఫ్రెంచ్ పౌర నియమావళి ఆర్టికిల్ 215 ప్రకారం
వివాహిత జంట సహజీవనానికి, శారీరక సంబంధాలకు అంగీకరించాలి. భార్య,భర్తల మధ్య శారీరక సంబందాలు వారిలోని అనురాగాన్ని పెంచుతాయని ఈ సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు.కాగా ఆ భర్త జీన్ అలసిపోవడం, ఆరోగ్య సమస్యల వల్ల సెక్స్ లో పాల్గొనలేకపోయానని కోర్టులో తెలపడం కొసమెరుపు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!