గాలి అరెస్టు జ‌గ‌న్‌కి న‌ష్టం


గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి అరెస్టుతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత  వైఎస్ జ‌గ‌న్‌కి పెద్ద దెబ్బే త‌గిలింద‌ని చెప్పొచ్చు. జ‌గ‌న్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు గాలి జ‌నార్థ‌న్ రెడ్డి అంతేకాదు వీరిద్ద‌రికీ వ్యాపార లావాదేవీలు కూడా చాలానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీని తిర‌స్క‌రించి తాను కొత్త పార్టీ పెట్ట‌డం వెనుక గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి ప్రోత్సాహం, ప్రోద్బ‌లం ఉంది. అంతేకాకుండా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్ర‌మాలు దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలోనే తీవ్ర‌స్థాయిలో జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో గాలి జ‌నార్థ‌న్ రెడ్డి అరెస్టు జ‌గ‌న్‌కి పెద్ద దెబ్బ‌గానే క‌నిపిస్తుంది. గాలి సోద‌రులు క‌ర్నాట‌క బిజెపితో తెగ‌తెంపులు చేసుకుని కొత్త పార్టీ పెట్టాల‌ని యోచిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో గాలి అరెస్టు కావ‌డం విశేషం. గాలి అక్ర‌మ మైనింగ్ కేసులో అరెస్ట‌యితే త్వ‌ర‌లో జ‌గ‌న్ కూడా అక్ర‌మ ఆస్తుల కేసులో అరెస్టు అవుతార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా జ‌రిగితే త‌ర్వాత ప‌రిణామాలు ఎలా మార‌నున్నాయ‌న్న ఆస‌క్తి నెల‌కొంది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!