ప్లీజ్…ఆత్మహత్యలు చేసుకోవద్దు


ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆత్మహత్యలు చేసుకునేవారి శాతం ఏటికేడు పెరిగిపోతున్నది. ఈరోజు వరల్డ్ సుసైడ్ ప్రివెన్సన్ డే  సందర్భంగా 5amnews.com అందరిలోనూ ఆత్మస్థైర్యాన్ని పెంచడంకోసం ఈ వివరాలు అందిస్తోంది.

ప్రతి ఏటా సెప్టెంబర్ పదోవ తేదీన   వరల్డ్ సుసైడ్ ప్రివెన్షన్ డేను పాటిస్తున్నారు. ఆత్మహత్యలపై చైతన్యం కలిగించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది , ప్రపంచంలోని విభిన్న సంస్కృతులున్న సమాజాల్లో ఆత్మహత్యలకు దారితీస్తున్న  అంశాలపై చైతన్యం కలిగించాలని నిర్ణయించుకున్నారు.  ప్రతిఏటా పది లక్షల మంది  ఆత్మహత్యలకు పాల్పడు తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.

ఆత్మహత్యలకు కారణాలు..

1. తీవ్ర మానసిక ఒత్తిడి

2. ప్రేమలో వైఫల్యం

3. అప్పులబారిన పడటం

4. వేధింపులు

మనదేశంలో రైతుల ఆత్మహత్యలు పెనుసమస్యగా మారాయి. 2002-06 మధ్యకాలంలో 17,560 మంది రైతుల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా,  మహారాష్ట్రలో 2006లోనే
4,453 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. జాతీయ నేర గణాంకాల బ్యూరో ఈ వివరాలను వెల్లడించింది. దేశంలో 1989లో   8.47గా ఉన్న సుసైడ్ రేట్ పదేళ్లు గడిచేసరికి 11.21కి పెరిగింది. 2006లో అది 10.5గా ఉంది.
మనరాష్ట్రంలో 2005-07 మధ్య 1,313 మంది రైతుల ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
సర్వేలు చెప్పిన నిజాలు ఇవి..
ప్రపంచంలో 12.4 కోట్ల మందిలో
తీవ్ర స్థాయి డిప్రెషన్ లో ఉన్నారు.
వీరిలో మూడింట రెండోవంతు మంది
వైద్యం చేయించుకోవడంలేదని తేలింది.
వీరే తరచూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారని సర్వేలు చెప్పాయి.
మొత్తానికి విభిన్న సమాజాల్లో చైతన్యం కలిగిస్తూ, ఆత్మస్థైర్యం పెంపొందించగలిగితే ఆత్మహత్యల శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!