వర్తమానం


బాంబులలా నిరంతరం పేలాలి!
ప్రజల ప్రాణాలే మరి పేలాలు!
రక్షణ ఇవ్వలేని సర్కారు
పవర్లో పవళించడం బేకారు!

గాలి భూతంలా అవినీతై ప్రవహిస్తుంటే
నిప్పుతో జోడీ లేదనడం వింతే!
నా గన్ను పేలితే మీరంతా గల్లంతే!
గాలితో తూటా దారి మళ్ళిందంతే!

అవినీతికి మద్దతు ఇచ్చుట మన కర్తవ్యం!
అవినీతిని చెయ్యండీ చట్టబద్ధం
ఎన్నాళ్ళుగా వుంటుందీ మన చుట్టం
అవినీతి సంద్రంలో అందలాన తిమింగలం!

జనావళికి అలవాటే మొద్దు నిద్ర
నేతల ఉద్యమాల వెనక ఓటు ముద్ర
ప్రభుత చూస్తే వాయిస్తది నీరోలా ఫిడేలు!
బతుకు భయంతో జనతకు అనునిత్యం కన్నీళ్ళు!

- చల్లా రామ ఫణి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!