శృంగారం సుఖంగా సాగాలంటే..? పార్ట్ – 2


స్త్రీ శరీరంలో సహజ సుగంధభరితం అందులోనూ పద్మినీ జాతి స్త్రీ శరీరం … ఇలా శాస్త్రాలలో ఏవేవో చెబుతూ ఉంటారు. అసలు శాస్త్రాలలో చెప్పినట్టుగా స్త్రీలలో జాతులున్నాయో లేవో తెలియదు కానీ, మొత్తానికి స్త్రీ శరీరం నుంచి సెంట్ వంటి వాసనోచ్చినా అది తమలో కోరిక పెంచుతుందని అనేకమంది పురుషులు చెప్పారు. సుమారు 60 శాతం మంది పురుషులు తాము స్త్రీలలో సన్నిహితంగా మసలే సమయం పెరిగిందని చెప్పారు. ఎటువంటి సెంట్ ఎంచుకోవాలి అనేది ప్రశ్న. మీకు కేవలం ఒక అడుగు దూరంలో, అదీ ఎదుటి వారు కావాలని గమనించితే తప్పితే తెలియనంతగా ఉండే సుగంధాన్నిచ్చే సెంట్ ని మాత్రమే ఎంచుకోవాలి. మీరు కనపడనప్పటికీ మీ సెంట్ తాలూకు సుగంధం ఆధారంగా మిమ్మల్ని గుర్తిస్తున్నాడంటే ఆ సెంట్ ని మార్చాల్సిన అవసరం ఉందని తెలుసుకొంది.
డియోడరెంట్స్, సెంట్స్ వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలా పాటించకుంటే ప్రయోజనం కలగకపోగా, నష్టం కలుగుతుంది. రకరకాల అవసరాల కోసం అనేక రకాల సెంట్స్ మార్కెట్లో దొరుకుతుంటాయి. అందులో రొమాంటిక్ మూడ్ పెంచేవి కొన్ని ఉంటాయి. వాటిలో మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి కొంటున్నారో ఆ రకానికి చెందిన సెంట్స్ ఎంచుకోవాలి.
ఎదుటి వారి శరీరం నుంచి దుర్గంధం వెలువడేప్పుడూ, సుగంధం వెలువరిస్తున్నప్పుడూ ఉండే తేడా అందరికీ తెలిసిందే. అదే తేడా శృంగారాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరం నుంచి మనోహరమైన, ఆహ్లాదకరమైన సెంట్ వాసన వస్తున్నప్పుడు మనసుకు హాయి కలుగుతుంది. ఎదుటి వ్యక్తిపై అనురాగమే కాదూ … కాంక్ష కూడా పెరుగుతుందని మీకు తెలుసు. ఇక ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా సువాసనలిచ్చే ద్రవ్యాల, ద్రవాల వాడకాన్ని పెంచడమే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!