రవితేజ, పూరిల ‘ఇడియట్ 2′
రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఇడియట్’ చిత్రం సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కి స్టార్ ఇమేజ్‌ని తీసుకు రావడమే కాకుండా ఈ ఇద్దరి కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తయారుకానుంది. పూరి జగన్నాథ్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై పూరి జగన్నాథ్ నిర్మించే ఈ చిత్రానికి ‘ఇడియట్ 2′ అనే పేరు నిర్ణయించారు.
ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘అప్పట్లో ఇడియట్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉందని ఆడియన్స్ ఫీలయ్యారు. అలాగే ఈ సినిమా కూడా ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను’ అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాణం, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి