తుర్లపాటికి జాతీయ రేడియో ప్రతిభా పురస్కారం


ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైన డాక్యుమెంటరీ అదిగో హరివిల్లుకు 2010 సంవత్సరానికి గాను జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఈ రూపకాన్ని సీనియర్ జర్నలిస్టు తుర్లపాటి నాగభూషణ రావు రచించారు. కాగా, ఆకాశవాణి కేంద్ర కార్యక్రమ నిర్వహణాధికారి కె. విజయ పర్యవేక్షణలో ఈ డాక్యు మెంటరీ రూపొందింది. వీరిద్దరికీ ఆకాశవాణి కేంద్రం ప్రతిభా పురస్కారాలను అందజే స్తుంది. తుర్లపాటి నాగభూషణ రావు గతంలో ఆంధ్రప్రభతోపాటుగా ఈనాడు, తెలుగువన్ డాట్ కామ్ సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం టివీ5 న్యూస్ లో పనిచేస్తున్న తుర్లపాటి నాగభూషణరావు రాసిన నిప్పురవ్వ – డైలీమిర్రర్ ఎపిసోడ్ బంగారు నంది అవార్డుకు ఎంపికైంది. కాగా, ఆయన సమర్పణలో ప్రసారమైన `బాలికలతో మరణమృదంగం’ చర్చా కార్యక్రమానికి యునిసెఫ్ -2011 అవార్డు లభించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!