టెస్ట్ సిరీస్ మనదే..!
విండీస్ గడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత భారత్ టెస్టు సిరీస్ గెలిచింది. డొమినికాలో జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియ డంతో.. 1-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. విండీస్ విసిరిన 181 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ మూడు వికెట్లు కోల్పో యింది. ఈ దశలో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. దీంతో మూడు టెస్టుల సిరీస్ 1-0 తేడాతో భారత్ వశమైంది. సెంచరీతో జట్టును ఆదుకున్న చందర్‌పాల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా… బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన ఇషాంత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. విండీస్ గడ్డపై సిరీస్ నెగ్గాలని ఎన్నో సంవత్సరాల నుండి భారత్ ప్రయత్నిస్తూనే ఉంది.. కానీ ఆ కోరిక ఇన్నాళ్ళకి గానీ తీరలేదు.. మొత్తానికి విండీస్‌తో జరిగిన, వండే, టెస్ట్ సిరీస్‌లు రెండూ భారత్ వశం చేసుకుని వరల్డ్ నెం. 1 జట్టు తామే అని నిరూపించుకుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి