భాను లొంగిపోతాడా..?
సూరిని హత్యచేసి తప్పించుకు తిరుగుతున్న భాను తాను లొంగిపోయేందుకు పోలీసుల ముందు షరతులు పెడుతున్నట్లుగా తెలు స్తోంది. భాను తాను వెళ్లేటప్పుడు తీసుకు వెళ్లిన డబ్బులు కాకుండా ఇటీవల మూడు నెలల కాలంలో ముప్పై లక్షలు ఆయనకు చేరి నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భానుకిరణ్ అజ్ఞతంలో ఉండటానికి ఎవరో సాయం చేస్తున్నందునే ఆయన ఆటలు సాగుతున్నాయని భావించిన పోలీసులు భానుకు వెళ్లి డబ్బుపై పూర్తిగా నిఘా పెట్టారు. దీంతో భానుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అజ్ఞాతంలో ఉంటే ప్రాణభయం కూడా భానుకు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలాగే అజ్ఞాతంలో ఉంటే కష్టమని భావించిన భాను కిరణ్ తాను లొంగిపోతే బెయిలు తీసుకొని బయటకు రావచ్చని భావించి లొంగిపోయేందుకు సిద్దపడినట్లుగా తెలుస్తోంది. భానుకు పోలీసు లకు మధ్యన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు రాజకీయవేత్తలు రాజీకుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వారు అంతగా పలుకుబడి లేని నాయకులు కావడం గమనార్హం. వారి వెనుక ఎవరైనా ప్రముఖులు ఉన్నారా అనే కోణంలోనూ పోలీ సులు విచారిస్తున్నారు. కాగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఇచ్చిన ఆధారాలను బట్టి భానుకిరణ్ ఎక్కడ ఉన్నాడో, ఆయనకు డబ్బు ఎలా వెళుతుందో అనే అంశాన్ని పోలీసులు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే భాను పోలీసులకి లొంగిపోయేందుకు రంగం సిద్దమవుతోందన్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియకపోయినా.. ప్రస్తుతం భాను ముందున్న ఏకైక మార్గం పోలీసులకి లొంగి పోవడమే…
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి