యజుర్వేదంలో సంపదే సంపద..!
యజుర్వేద మందిరం.. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో గల సత్యసాయి బాబా నివాసం యజర్వేద మందిరం, సత్యసాయి బాబా శివైకం తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు యజుర్వేద మందిరం. ఈ మందిరంలో వేలకోట్ల విలువైన సంపద వుందని వచ్చిన వార్తలు, ఆ తర్వాత సత్యసాయి ట్రస్టు సభ్యులు రహస్యంగా ఆ మందిరంలోనుండి నిధిని తరలించడం, కోట్లాది రూపాయలు పోలీసులకు చిక్కడం.. ఆ తర్వాత అధికారికంగా ప్రభుత్వ అధికారులతో తిరిగి యజుర్వేద మందిరంలోని గదులలో సోదాలు నిర్వహించడం, ఆ గదుల సోదాలలో మొత్తం రూ.76,89,493 విలువైన బంగారం, వెండి, వజ్రాల ఉంగరం ఉన్నట్లు తేల్చారు. ఇందులో వెండి నగలు 116 కిలోలు, బంగారం 905 గ్రాములు, వజ్రాల ఉంగరం ఉన్నట్లు తేల్చారు. ఈ నిధిని సోమవారం నాడు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని సెలవిచ్చారు.. దొంగలు పడ్డాక ఆరు నెలలకు అన్న చందంగా అధికారికంగా జరిగిన సోదాలలోనే లక్షలాది రూపాయల సంపద వెలుగులోకి వస్తే, అనధికారికంగా కోట్లాదిరూపాయలు తరలిపోయిందన్న విషయం చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు.. ఆ సంపద తరలి పోయిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా మన అధికారులు కళ్లు తెరిచి ఈ సంపదని వెలుగులోకి తీసుకువచ్చారు సంతోషం.. కానీ.. ఇంకా కొన్ని గదులలో సోదాలు నిర్వహించలేదని.. వాటిని కూడా తెరిచి ఆ సంపదని కూడా త్వరలోనే బయటికి తీసుకువస్తారని చెబుతున్నారు.. అంటే.. ఆ గదులలో మరింకెంత సంపద మూలుగుతుందో.. ఏమో..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి