వెండితెర‌కి న‌య‌న దూరం..?


ద‌క్షిణాది భాష‌ల‌లో హీరోయిన్‌గా న‌టించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన తార న‌య‌న‌తార‌. ఆమె సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ వంటి స్టార్ హీరో్ స‌ర‌స‌న‌నే కాకుండా మ‌న తెలుగులో యువ‌ ర‌త్న బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌ టేష్ లాంటి స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది అంతే కాదు యువ హీరోల‌యిన ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, సూర్య‌, శింబు ల‌తో కూడా న‌టించి మెప్పించింది. ఆ మ‌ధ్య శింబుతో పీక‌ల్లోతు ప్రేమాయ‌ణంలో మునిగిపోయిన న‌య‌న త‌న సినీ కెరీర్‌ని పాడు చేసుకుంది. ఎలాగోలా శింబుని వ‌దిలించుకుని తిరిగి సినిమాల‌లో యాక్టివ్‌గా న‌టిస్తూ ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. మ‌ళ్లీ ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన ప్ర‌భుదేవాతో న‌య‌న‌ ప్రేమ‌లో ప‌డింది. వారిద్ద‌రి ప్రేమ పెళ్లి వ‌ర‌కూ వెళ్లింది. ప్ర‌భుదేవా నయనతార కోసం త‌న భార్య  ‘రమాలత్’కు భారీ మూల్యాన్నే చెల్లించి విడాకులు తీసుకోబోతున్నాడని తెలి సింది. 45 కోట్లు ‘రమాలత్’కు ఇవ్వడానికి కోర్టులో ఒప్పుకున్నాడని తమిళ పత్రికలు మీడియా తెలిపింది. ప్రభుదేవా ‘రమాలత్’కు పుట్టిన కొడుకు మరణించిన విషయంలో ప్రభుదేవాకు ‘రమాలత్’కు వచ్చిన మనస్ఫర్థల కారణంగానే ప్రభుదేవా నయనతారను ప్రేమించాడని ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నాడని ఫిలింనగర్ న్యూస్.
నయనతార కూడా ప్రభుదేవాను పెళ్ళి చేసుకోమని తొందర పెట్టడంతో, ప్రభుదేవా ‘రమాలత్’ కోరిన 45కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు ‘కోలీవుడ్’ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ‘శ్రీరామ రాజ్యం’లో సీతగా నయనతార నటించిన తర్వాత ప్రభుదేవాను పెళ్ళి చేసుకోవాలనే తలంపుతో, ఏ సినిమాలోనూ నటించడానికి ఒప్పుకోవ డం లేదని, అనేక ఆఫర్లు వచ్చినా త్రోసిపుచ్చిందని వినికిడి. తాజాగా శ్రీ‌రామ‌రాజ్యం చిత్రం షూటింగ్ పూర్త‌ యిన సంద‌ర్భంగా న‌య‌న తార చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రికీ వీడ్కోలు చెబుతూ క‌న్నీరు పెట్టుకుంది. అంటే ఇక ఈ చిత్రం త‌ర్వాత తాను వెండితెర‌కి దూరం అవుతున్నాన‌ని, ప్ర‌భుదేవాతో పెళ్ళి త‌ర్వాత పూర్తిగా ఇంటికే ప‌రిమిత‌మ‌వుతుంద‌న్న కార‌ణంతోనే ఆమె అలా భావోద్వేగానికి లోన‌యింద‌ని కొంద‌రు చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!