అధిష్టాన‌మా.. ఎటు నీ దారి..?


ఎన్న‌డూ లేని విధంగా అధికారిక తెలంగాణ కాంగ్రెస్ ఎం.పి.లు ఒక‌తాటిపైకి వ‌చ్చి రాజీనామా ప‌త్రాల‌ని స‌మ‌ ర్పిస్తున్నామ‌ని చెప్పినా కూడా కాంగ్రెస్ హైక‌మాండ్ ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని విశ్లే ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  రాజీనామాలతో నష్టం లేదనుకున్నారో.. లేక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తు న్నారో తెలియ‌దు కానీ ఢిల్లీ లో ఎంపీలు ఎంత హ‌డావిడి చేసినా ప‌ట్టించుకోనట్టే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ నినాదంతో ఎంపీలంద‌రూ చేస్తున్న రాజీనామాల విష‌యంలో కేంద్ర ఆచితూచి  వ్య‌వ‌హిరి స్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఇప్పటికిప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాల్సిందేనని పట్టు పట్టడం లేదు. అందుకు అవసరమైన ప్రక్రియను మొదలుపెట్టాలని గట్టిగా చెప్తున్నారు. వారు కోరిన‌ట్టు ప్ర‌త్యేక తెలంగాన ప్ర‌క్రియ‌ను మొద‌లు పెడుతున్నామ‌ని చెబితే డిసెంబ‌ర్ 9 త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాలు పున‌రావృత్త‌మ‌వు తాయేమోన‌ని, స‌మైఖ్యాంధ్ర అంటూ ఆంధ్ర నాయ‌కులు కూడా మూకుమ్మ‌డి రాజీనామాల‌కు పాల్ప‌డ‌తా రేమో న‌ని అధిష్టానం భావిస్తుండ‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ ప్ర‌త్యేక తెలంగాణ విష‌య‌మై అన్ని పార్టీలు ఒక్క‌తా టిపైకి వ‌చ్చి త‌మ ప్ర‌త్యేక రాష్ట్ర నినాదాన్ని బ‌లంగా విన్పిస్తుండ‌డం, ఇంత బ‌లంగా స‌మైఖ్యాంధ్ర కోసం అక్క‌డి నాయ‌కులు ఉద్య‌మం చేయ‌లేరేమో అన్న భావ‌న కూడా ఉంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఇక రాజీనామా లు చేసేదేనని తేల్చి చెప్తున్న T – కాంగ్‌ ఎంపీలు.. తమ లేఖల్ని నేరుగా స్పీకర్‌కే ఇవ్వనున్నారు. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సరైన ఫార్మాట్‌లో కాకుండా కండిషన్లతో కూడిన లేఖని సమర్పిస్తారా.. సాగదీతకు ఆస్కారం లేని విధంగా రాజీనామా చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. మ‌రి అధిష్టానం ఈ రాజీ నామాల‌పై ఎలా స్పందిస్తుందో అన్న‌ది వేచి చూడాలి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!