వ‌రుస పేళుళ్లతో వ‌ణికిన ముంబ‌యి

26/11 తర్వాత మళ్లీ ముంబై నగరం వణికిపోయింది. వరుస పేలుళ్లతో మళ్లీ నెత్తురోడింది. బుధవారం సాయంత్రం.. దాదాపు మూడు చోట్ల పేలుళ్లు జరిగినట్లు సమాచారం అందుతోంది. జవేరీబజార్, దాదార్, ఒపెరా హౌజ్ లలో పెద్ద ఎత్తున పెలుళ్లు గాయి.. మొత్తం మూడు చోట్ల పేలుళ్లు జరిగాయి.  దాదర్ దగ్గర ఓ ట్యాక్సీ కార్ లో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అలాగే పేలుడు ధాటికి ఒపెరా హౌజ్ కంపించిపోయింది. మూడు పేలుళ్లతో ముంబై ఉలిక్కిపడింది. దాదాపు వంద మందికి పైగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. పేలుళ్లకు ముందు కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. దీంతో ముంబై నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. ముంబైతో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇక రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తో పాటు.. ప్రధాన నగరాలను అప్రమత్తం చేశారు. ఈ పేళుళ్ల వెనుక ఇండియ‌న్ ముజాహిదీన్ హ‌స్తం ఉండి ఉండ‌వ‌చ్చన్న అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!