రాష్ట్రాన్ని త‌డిపిన వ‌ర్ష‌పు జ‌ల్లులు..!


వ‌ర్షాకాలం ఎప్పుడో వ‌చ్చేసింది. ఋతుప‌వ‌నాలు కూడా ఎప్పుడో వ‌చ్చేసాయి.. ఇక వ‌ర్షాల‌తో భూమి త‌డిసి ముద్ద‌యి పోతుంద‌ని, పంట‌లు పండేందుకు కావాల్సిన నీరు అందుకోబో తున్నామ‌ని రైతులు ఎంతో ఆశిం చారు.. కానీ పోయిన‌నెల అలా వ‌చ్చిన‌ట్టే వ‌చ్చిన వ‌ర్షాలు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చేసాయి.. దాంతో రైతుల మొహం వాలిపోయింది.. గ‌త రెండు రోజుల నుండి తిరిగి రాష్ట్ర‌వ్యాప్తంగా కురుస్తున్న జ‌ల్లుల‌తో మ‌ళ్లీ రైతు మొహం వెలిగిపోతుంది. ఇక నుండి వ‌ర్షాలు కంటిన్యూగా కురుస్తాయ‌ని, ఋతుప‌వ‌నాలు కూడా బ‌ల‌ప‌డ్డా య‌ని, ఇక విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు. దాంతో వ్య‌వ‌సాయం చేసుకునే రైతులలో ఆశ‌లు చిగురిస్తున్నాయి.. ప‌ట్ట‌నాల్లో నివ‌సించే వారు వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డ‌ డంతో సేద‌తీరుతున్నారు. న‌దులూ, వాగులు, వంకలు ప‌రుగులు తీస్తున్నాయి.. అంతే స్పీడుగా మ‌న హైద‌రాబాదు న‌గరంలో డ్రైనేజీలు కూడా ప్ర‌వ‌హిస్తూ రోడ్ల‌పై త‌మ ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాయి. మొత్తానికి ఇప్ప‌టికైనా వ‌ర్ష‌పు జ‌ల్లులు నేల‌ని తాకి రైతు మొహంలో వెలుగు నింపినందుకు వ‌ర్షానికో థ్యాంక్స్‌..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!