తెలంగాణ జిల్లాల్లో రైల్‌రోకో…!

తెలంగాణ పొలిటిక‌ల్ జెఏసి ఇచ్చిన పిలుపుతో నేడు తెలంగాణ జిల్లాలంత‌టా రైల్‌రోకో కార్య‌క్ర‌మం జ‌రుగు తోంది. అన్ని జిల్లాల్లో ఆ యా రైల్వే స్టేష‌న్ల‌లో ఉద్య‌మ కారులు ప‌ట్టాల‌పై కూర్చుని త‌మ నిర‌స‌న‌ల‌ని తెలుపు తున్నారు. ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ముందుగానే అప్ర‌మ‌త్త‌మై నేడు రైళ్ళ‌ని ర‌ద్దు చేయ‌డంతో ఉద్య‌మం కాస్త సాఫీగానే జ‌రుగుతుంది. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆర్‌.టి.సి. బ‌స్సుల‌ను ఆయా రైల్వే స్టేష‌న్ల ముందు రెడీగా ఉంచారు. ప్ర‌యాణీకుల‌కు ఏమాత్రం ఇబ్బంది క‌ల‌గ‌కుండా అధికారులు అన్ని జ‌గ్ర‌త్త‌లు తీసుకు న్నామ‌ని చెబుతు న్న‌ప్ప‌టికీ.. అక్క‌డ‌క్క‌డ ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బం దుల‌ని ఎదుర్కొంటున్నారు. టి.ఆర్‌.ఎస్‌., టి.డి.పి. కార్య‌క‌ ర్త‌లు ఈ రైల్‌రోకో కార్య‌క్ర‌మాల‌లో చురుకుగా పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో రైల్ రోకో కార్యక్ర‌మానికి హాజ‌ర‌వ‌డానికి వ‌చ్చిన బి.జె.పి. నేత బండారు ద‌త్తాత్రేయ‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న్ని స్టేష‌న్‌లోకి వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకు న్నారు. దాంతో ద‌త్తాత్రేయ పోలీసుల‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. నేడు జంట‌న‌గ‌రాల‌లో తిర‌గాల్సిన ఎం.ఎం.టి.ఎస్‌. రైళ్ళ‌ని ర‌ద్దు చేయ ‌డంతో ఆయా రైల్వే స్టేష‌న్ల‌న్నీ బోసిపోయి క‌నిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మానికి కొన‌సాగింపుగా జ‌రుగుతున్న ఈ రైల్‌రోకో కార్య‌ క్ర‌మం విజ‌య‌వంతంగా సాగుతున్న‌ప్ప‌టికీ.. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇప్ప‌ట్లో వ‌చ్చేలా లేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!