విష్ణుకి స్విస్ పోలీసుల ఝలక్..!
స్విట్జర్లాండ్ పోలీసులు మన హైదరాబాద్ పోలీసులంత మంచోళ్లు అని అనుకున్నట్టున్నాడు హీరో మంచు విష్ణు వర్ధన్. కొంతకాలం క్రితం విష్ణు జెనివా వెళ్లారు. అక్కడ ఆయన కారు డ్రైవ్ చేశారు. అది తప్పుకాదు. కాని నిర్దిష్ట వేగం కంటే మించి కారు నడిపారు. నూట ఇరవై కిలో మీటర్ల వేగం వరకు ఆ రహదారిలో కారు నడప వచ్చు. కాని మన హీరో 145 కిలో మీటర్ల వేగంతో నడపడంతో వెంటనే బుక్ అయ్యారు. స్విస్ పోలీసులు మనపోలీసోళ్లంత బద్దకస్తులు కారు కాబట్టి విష్ణు నడిపిన కారు వివరాలు, డ్రైవ్ చేసిన విష్ణు వివరాలు సేక రించి ఇంటర్ పోల్ ద్వారా సమాచారం సంపాదించి హైదరాబాద్ పోలీసులకు ఆ సమచారం పంపారు. ఆ వారంట్ పట్టుకుని సిఐడి పోలీసులు విష్ణును కలిసి వివరించారు. దాంతో విష్ణు మరో మాట మాట్లాడకుండా ఆ జరిమాన మొత్తం సుమారు ఇరవైనాలుగు వేల రూపాయల మేర చెల్లించారు. అయినా హీరోయిజం అన్నది వెండితెర మీద చూపించాలి, లేదంటే మన రాష్ట్రంలో చూపించాలి.. అంతేకానీ దేశంకాని దేశంలో చూపిస్తే.. ఇదిగో.. ఇలాగే అవుతుంది మరి..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి