ఆ రెండు సీన్ల‌ని చూస్తే సిగ్గేస్తుంది..!

అని అంటున్నాడు స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్‌. ఓ టి.వి. ఛానెల్‌లో ఇంట‌ర్వ్యూ ఇస్తూ పై విధంగా స్పందించాడు. ఇంత‌కీ ఏమిటా రెండు సీన్లు.. తాను ఇన్ని సినిమాలు రూపొందించినా నా ప‌ర్స‌న‌ల్‌గా బ్యాడ్‌గా ఫీల‌య్యేది ఆ రెండు సీన్ల గురించే అని బాధ‌ ప‌డుతూ చెప్పాడు వి.వి. వినాయ‌క్. ఆ రెండు సీన్లు సాంబ చిత్రంలోనివి. ఆ సీన్లు ఎప్పుడైనా టి.వి.లో చూసినా సిగ్గుతో త‌ల దించు కుంటాడ‌ట వినాయ‌క్‌. వినాయ‌క్ అంత‌గా ప‌శ్చ‌త్తాప ప‌డుతున్నాడంటే ఇంత‌కీ  ఆ సీన్ల‌లో ఏముంది..? అనే క‌దా.. ఒక‌టి.. సొంత వ‌దిన‌పై ఓ శాడిస్టు మ‌రిది అత్యాచారానికి పాల్ప‌డ‌టం ఒక‌టైతే.. మ‌రొక‌టి ఎన్‌.టి.ఆర్‌. విల‌న్ల‌ని చంపే సీన్ల‌లో ఎన్టీఆర్ క‌త్తితో ఏకంగా త‌ల‌ని తెగ్గొట్టేయ‌డం.. సినిమా షూటింగ్ చేస్తున్న‌ప్పుడు ఈ సీన్లు సినిమాకి ప్ల‌స్స‌యితాయ‌ని భావించాడ‌ట‌.. కానీ తీరా అవి సినిమా లో చూస్తోంటే.. తానెంత మూర్ఖంగా ఈ రెండు సీన్ల‌ని తీసానా అంటూ ఫీల‌యిపోయాడు వినాయ‌క్‌. ఒక వ‌దిన‌ని, మ‌రిది అత్యాచారం అది క‌ట్టుబాట్ల‌కి విరుద్దం, త‌ల‌ని మొండానికి వేరు చేయ‌డ‌మ‌న్న‌ది అది పైశాచిక‌త్వానికి ప‌రాకాష్ట… ఇలా ఎంత సినిమా అయినా సినిమాలో కూడా కొన్ని ప‌ద్ద‌తులు అనుస‌రించాల్సిన అవ‌స‌రం ఉంటుంది.. మొత్తానికి వినాయ‌క్ తాను చేసిన త‌ప్పు తెలుసుకుని ఇప్ప‌టికీ ప‌శ్చాత్తాప ప‌డ‌టం గొప్ప విష‌యం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!