బొత్సకు ఝలక్ ఇచ్చిన ఆజాద్


రాష్ట్రకాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీఆజాద్ , పిసిసి చీఫ్ బొత్ససత్యనారాయణకు ఝలక్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం చిరంజీవి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అంతకంటే ముందు గాంధీభవన్లో పిసిసిచీఫ్ ను కలుస్తునానని ముందే హామీ ఇచ్చారు. ఇక్కడి నుంచి బొత్సతో సహా చిరంజీవి ఇంటికి వెళ్లడానికి కార్యక్రమం ముందే బొత్స నిర్ణయించుకున్నారు. అయితే ఆజాద్ బొత్స ఆశలపై నీళ్లు చల్లారు. ఆయనను తీసుకువెళ్లకపోవడమే కాదు కనీసం బొత్స గాంధీభవన్ బయట పదినిముషాల పాటు వెయిట్ చేస్తున్నారని తెలిసినా పట్టించుకోకుండా చిరంజీవి ఇంటికి వెళ్లిపోయారు. పాపం ఈ విష యాన్ని ఎవరో చెప్తే ఆ..చిరంజీవి ఇంటికి వెళ్లారా..వస్తానన్నారే అని కాస్త అసంతప్తి చెందారట. చిరంజీవి, ఆపార్టీ ఎమ్మెల్యేలతో కాస్త ప్రైవేట్ గా మాట్లాడాలనుకున్నారో ఏమో మధ్యలో ఈయనెందుకని భావించి ఆజాద్ వెళ్లిపోయినట్లుంది. పాపం బొత్స..ఇంకా ఎన్ని ఝలక్ లు ముందుముందు ఉంటాయో..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!