బెదిరింపులొస్తున్నాయి..!
డాక్టర్ మంత్రి శంకరరావు మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు.తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగు స్పందన లేదని వ్యాఖ్యానించారు. జగన్ ఆస్తుల పై విచారణ చేయాలని కోరుతూ శంకరరావులేఖ రాసిన నేపధ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఉంటుంది. తనకు బెదిరింపులు వస్తున్నాయని , అయినా రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. దీనిపై హైకోర్టుకు లేఖ రాస్తానని ఆయన చెప్పారు. శంకరరావు ఏమి చెబుతారో, ఎందుకు చెబుతారో ఎవరికి అర్దం కాదు. తన పిఎ రామనరసింహరావు పై పోలీసులకు ఫిర్యాదు చేసిన శంకరరావుకు ఎవరినుంచి బెదిరింపు వచ్చిందో కూడా ఆయన చెబితే బాగుండేది.ప్రతిసారి ఏదో వివాదం సృష్టించడం, దానిద్వారా ప్రచారంలోకి రావడం శంకర రావుకు ఇదొక అలవాటుగా మారింది.ఈయన ఫిర్యాదు అసలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందా? డిజిపి దగ్గరకు చేరిందా?ఈయన ఒకసారి బెదిరింపు అంటారు.మరోసారి ఇంకోమాట చెబుతారు.గతంలో పోలీసు శాఖపై కూడా ఆరోపణలు చేశారు.తీరా వెళితే ఏమీ చెప్పలేదు.అందువల్ల ప్రభుత్వం కూడా ఈయన ఏమి మాట్లాడినా సీరియస్ గా తీసుకోవడం మానేసింది. కాకపోతే హైకోర్టు జగన్ పై రాసిన లేఖను సీరియస్ గా తీసుకోవడంతోనే శంకరరావుకు మళ్లీ ప్రాముఖ్యత పెరిగింది. అయితే ఆయన తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు చోరికి గురి అయ్యాయని చెప్పారు కనుక వాటి గురించి సిబిఐ ఈయన నుంచి కొత్తగా తెలిసుకునే విషయం ఉండదేమో.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి