రాహుల్‌పై క‌త్రిన హాట్ కామెంట్‌..!

ఒక్కోసారి సినిమా నటులు ఎందుకు మాట్లాడతారో తెలి యదు.అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేస్తారో అర్ధం కాదు. ప్రముఖ నటీ కత్రినా కైఫ్ చేసిన ఒక ప్రకటన సంచలనంగా ఉంది.యువనేత రాహుల్ గాంధీ సగం భారతీ యుడేనని కత్రినా కైఫ్ అన్నారు.రాహుల్ గాందీ తల్లి ఇటాలియన్ అని, తండ్రి భారతీయుడని ఆమె అన్నారు. ఇప్పుడు ఆమె ఈ సంగతి చెప్పవలసిన అవసరం ఏమిటో తెలియదు. పైగా ఆమె ఏమీ కొత్త రహస్యం చెప్పలేదు.కాని అవన్ని వాస్తవాలే అయినప్పటికీ, రాహుల్ సగం భారతీయుడు అని అనడం ఎంతవరకు సబబో అర్ధం కాదు. ఒకసారి జన్మించాక , ఏదో ఒకదేశానికి చెందిన వ్యక్తి అవుతారు.వేర్వేరు కులాలు, వేర్వేరు మతాలు, వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు దేశాలవారు పెళ్లిళ్లు చేసుకుంటే , ఆ తర్వాత వారు ఎంపిక చేసుకున్న, లేదా వారి పౌరసత్వాన్ని బట్టి ఆదేశ పౌరులవుతారు. ఈ సెలబ్రిటీస్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పడు జాగ్రత్తగా లేకపోతే వారే ఇబ్బందులలో పడతారు. ముంబై లో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!