తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ గ‌ల్లంతే..!


తెలంగాణ సాధనకోసం చర్చల నిమిత్తం వెళ్లిన కాంగ్రెస్ ప్రతినిధి బృందానికి పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జీ గులాం నబీ అజాద్ నుంచి తీవ్ర మైన వ్యాఖ్యలు వచ్చినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుతో మీరు పోటీచేసి గెలవాలనుకుంటున్నారు.అలాగైతే మీ ఇష్టం, మీరు పార్టీని వదలి వెళ్లవచ్చు అని అజాద్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. దానికి ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాక, తాము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసమే రాజీనామాలు చేశాము తప్ప తెలంగాణ రాష్ట్ర సమతి ఉచ్చులో చిక్కుకోవడానికి కాదని వారు వివరించడానికి యత్నించినట్లు చెబుతు న్నారు. అంతేకాక అజాద్ మరో మాట అన్నారట. తెలంగాణ ను మీరు కోరుతున్నారు. తెలంగాణ ఇచ్చామనుకోండి ఏమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు మరింత బలోపేతం అవుతారు. ఆయన పార్టీ ఇంకా లబ్ది పొందుతుంది. అదే సమయంలో సీమాంద్రలో పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. అలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అని అజాద్ ప్రశ్నించారు. ఒకవేళ మీరు టిఆర్ఎస్ మద్దతు తీసుకుని గెలవవచ్చని అనుకుని పార్టీని వదలదలచుకుంటే అది మీ ఇష్టం అని అజాద్ నిష్కర్షగా చెప్పారని కధనాలు వచ్చాయి. దీంతో తెలంగాణ నేతలు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!