స‌మైఖ్య హైదరాబాద్ కు స‌న్నాహాలు..?

రాష్ట్ర విభజన సమస్యపై మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇక ఎక్కువకాలం ఈ సమస్యను అపరిష్కృతంగా ఉంచజాలమని భావిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ నగరమే ప్రదాన సమస్య అని కేంద్రం గుర్తించిందని, దానిపైనే దృష్టి పెట్టిందని ఆంద్రప్రభ పత్రిక ఒక కధనాన్న బ్యానర్ గా ఇచ్చింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిలో హైదరాబాద్ ను కేంద్రం పాలితప్రాంతంగా ఉంచి, ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడమే ఉత్తమ పరిష్కారమని భావిస్తు న్నట్లు ఈ పత్రిక తెలిపింది.హైదరాబాద్ తెలంగాణలో అంతర్భా గమని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతున్నవారు గట్టిగా వాదిస్తుం టే, సీమాంద్రులు హైదరాబాద్ ను వదులు కోవడానికి సిద్దపడడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ను పూర్తిగా వదలిపెడితే తమకు రక్షణ ఉండదని సీమాంధ్రులు భయపడుతున్నారు. అందువల్ల దానికి వారు ఒప్పుకోవడం లేదు. ఈ నేపద్యంలో పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా చండీగడ్ ఉన్న రీతిలోనే హైదరాబాద్ ను కూడా ఉమ్మడి రాజధానిగాను, అలాగే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడమే ఉన్నంతలో మంచి పరిష్కారమని కేంద్ర అభిప్రాయపడుతున్నట్లు ఈ కధనం సూచిస్తు న్నది.ముఖ్యంగా రక్షణ శాఖకు సంబందించిన అనేక సంస్థలు ఇక్కడ ఉన్న నేపధ్యంలో దీనిని ఏ ఒక్క రాష్ట్రానికి బదలాయించినా ఇబ్బందులు వస్తాయని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆగస్టు పదిహేను లోగా ఈ సమస్యను పరిష్కరిం చాలని కేంద్రం ఒక నిశ్చితాభిప్రాయంలో ఉన్నట్లు ఈ కధనం వెల్లడిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!