మంత్రి శంక‌ర్రావు రాజీనామా..!


తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎం.పి.లు, మంత్రులు మూకుమ్మ‌డిగా రాజీనామాలు చేసినా గ్రేట‌ర్ సిటీ లోని మంత్రులు మాత్రం రాజీనామాల‌కి దూరంగా ఉన్నారు. సోమ‌వారం తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు చేసి న రాజీనామాల‌తో రాజ‌కీయ వాత‌వ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కిపోవ‌డంతో ఆ సెగ గ్రేట‌ర్ మంత్రుల‌కూ తాకింది. అమెరికా తెలుగు సంబ‌రాల‌లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి శంక‌ర్రావు ఒక మెట్టు దిగిరాక త‌ప్ప‌ లేదు. తాను రాజీనామా చేయ‌న‌ని చెబుతూ వ‌చ్చిన శంక‌ర్రావు అమెరికా నుండి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి త‌న రాజీనామా లేఖ‌ను అమెరికా నుండి ఫ్యాక్స్ ద్వారా స్పీక‌ర్ కార్యాల‌ యానికి పంపించారు. ఆయ‌న రాజీనామాతో రాజీనామాలు చేసిన మంత్రుల సంఖ్య 12కి చేరింది. ఇక గ్రేట‌ర్ ప‌రిథిలోని దానం నాగేంద‌ర్‌, ముఖేష్‌గౌడ్‌లు మొద‌టి నుండి ఉద్య‌మానికి దూరంగా ఉంటూ వ‌చ్చారు. ప్ర‌స్తు తం నెల‌కొన్న రాజ‌కీయ వేడికి వారుకూడా దిగివ‌చ్చి రాజీనామా చేస్తారా.. లేక త‌మ మాట‌కి క‌ట్టుబ‌డి ఉంటారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!