నాన్న మూవీ రివ్యూ
బ్యానర్ : వెల్ ఫేర్ క్రియేషన్స్, యస్.కె.స్టుడియోస్
నటీనటులు: విక్రమ్, అనుష్క, నాజర్, సంతానం, అమలా పౌల్ తదితరులు
సంగీతం: జివి ప్రకాష్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ ఎల్ విజయ్
నిర్మాతలు : విజయ ప్రసాద్, సురేష్ కొండేటి

కథ :
కృష్ణ(విక్రమ్) అయిదు సంవత్సరాల వయసుండే పిల్లాడి దశలోనే ఆయన మెదడు ఆగిపోతుంది. అలా కృష్ణ వయసులో ఎదిగినా, మానసికంగా మాత్రం 5 సంవత్సరాల కుర్రాడే. కృష్ణని ఓ కోటీశ్వరుడు (సచిన్) కూతరు ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. వీరు ఊటిలో కాపురం పెడతారు. అయితే కృష్ణ భార్య కూతురు వెన్నెల(సారా)కి జన్మనిచ్చి పురిటిలోనే చనిపోతుంది. అప్పటినుంచీ కృష్ణకి తన కూతురే ప్ర పంచం అవుతుంది.. తాను ఓ చాక్లెట్ కంపెనీలో పని చేస్తూ కూతురుని చదివిస్తూంటాడు. కృష్ణ తండ్రికి తన కూతురి బిడ్డ ఉందని తెలవడంతో ఊటీ వచ్చి కృష్ణని ఏమార్చి తన మనవరాలిని తనతో తీసుకువెళ్తాడు. కృష్ణ తన కూతురు కోసం పోరాటం మొదలెడతాడు. అప్పుడే లాయర్ గా ప్రాక్టీసు మొదలు పెట్టిన అనూరాధ(అనుష్క)తోకలిసి కోటీశ్వరుడయిన తన మామగారితో పోరాటం మొదలు పెడతాడు.. ఈ పోరాటంలో చివరికి ఎవరు నెగ్గారు..? కృష్ణ తన కూతురికి చేరువవుతాడా అన్నది తెరమీద చూడాల్సిందే..!
విశ్లేషణ :
ఈ చిత్రాన్ని హాలీవుడ్ మూవీ ఐయామ్ సామ్ స్ఫూర్తితో రూపొందించారు. ఆ చిత్రంలోని పాయింటుని ఆధారంగా చేసుకుని ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ మార్చి సినిమా రూపొందించారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే ప్రాణం.. ఇటువంటి కథతో ఓ సినిమా తెరకెక్కించాలంటే ఎంతో సాహసం కావాలి. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం బావుంది. ప్రతీ సన్నివేశాన్ని మనసుకి హత్తుకునే విధంగా తీయడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.
ఈ చిత్రానికి మరో ప్రాణం.. హీరో విక్రమ్ నటన.. ఇప్పటికే రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విక్రమ్ ఈ చిత్రం ద్వారా మరోమారు తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఫస్టాఫ్ అంతా హీరో విక్రమ్ నటన ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. మానసిక వికలాంగుడిలా విక్రమ్ పరకాయ ప్రవేశం చేశాడా అనిపిస్తుంది. కమలహాసన్ తర్వాత ఆ స్థాయిలో నటించగల సత్తా ఉన్న నటుడుగా విక్రమ్‌ని చెప్పుకోవచ్చు.
ఇక అనుష్క కూడా గ్లామర్ కు దూరంగా నటించి శభాష్ అనిపించుకుంటుంది. కమిడెయిన్ సంతానం నవ్విస్తాడు..కొన్ని చోట్ల ఎమోషన్స్ రైజ్ చేస్తాడు. విక్రమ్ కూతురుగా నటించిన బేబీ సారా నటన చాలా బావుంది.
కమర్శియల్ చిత్రాలతో సక్సెస్‌లు కొట్టాలని చూస్తున్న ఈ రోజుల్లో విక్రమ్ ఇలాంటి కథకి ఓకే చెప్పడం, తన నటనపై ఆయనకి ఉన్న నమ్మకం ఎలాంటిదో తెలుస్తుంది. ఈ చిత్రం కమర్శియల్ చిత్రం కాకపోయినప్పటికీ.. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం అని మాత్రం చెప్పొచ్చు. నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, తెరనిండా బూతు డైలాగులు లాంటి జోలికి పోకుండా ఎంతో నీటుగా ఈ చిత్రం ఉంటుంది.

మాస్ ఆడియెన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అవడం కాస్త సందేహమే అయినప్పటికీ.. ఒక మంచి చిత్రాన్ని చూసామన్న భావన మాత్రం ఈ చిత్రం చూసిన తర్వాత అనిపిస్తుంది.
Ch. Santoshkrishna
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి