దారుణా”నిధి”
ఒకటి విలువలను పాతరేసిన కరుణా నిధి ఫ్యామిలీ వెనకేసిన నిధి గురించి ఐతే.. నేల మాళిగలో పాతేసిన విలువ కట్టలేని రంగనా ధుని నిధి మరోటి.
రెండూ పెట్టెలు తెరవలేదు..లెక్క కట్టలేరు ..
ఒకటి తీగ బంధం – మరోటి నాగబంధం.
ఇక్కడ తీగ లాగితే డొంక కదులుతుందని… మారన్ అని మారాం చేసినా సరే పదవి లాక్కుని పెదవి విరిచేసింది కేంద్ర ప్రభుత్వం.
అక్కడేమో నాగబంధం గురించి వాకబు చేయాల్సిందిగా కోర్టు సెలవిచ్చింది.
2G - ఒకటి 2 జెనెరేషన్ ల ముందు దాచిపెట్టిన నిధి
మరోటి 2 జెనెరేషన్ పేరిట దోచున్నది
ఇంకా బయటకు రాబోయేవి ఎన్నున్నాయో లెక్క తెలీదు… గాలి గనులు, ఇనపగనులు, జ”గనులు ” ,
పుట్టపర్తి ట్రస్టు నిధులు .. అబ్బో ఇంకా చాలా ఉన్నాయి.. ఎవడన్నాడు ఇండియా పేద దేశమని..
పేదలున్న దేశం.
Phanimadhav Kasturi
:-D
రిప్లయితొలగించండి