ఆజాద్ ప్ర‌వ‌ర్త‌న‌పై హ‌స్తిన‌లో ఆసంతృప్తి..


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం అందడంతో కేంద్రం ఉలిక్కిపడింది. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి చేర వేశాయి. గుజరాత్‌లో ఉన్న సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ శనివారం ఢిల్లీ చేరుకోను న్నారు. జరిగిన పరిణామాలపై శనివారం పార్టీనేతలతో సోనియా చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్ర రాజ కీయ పరిణామాలపై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ వ్యవహార శైలిపై అధిష్ఠానానికి ఇప్పటికే ఫిర్యాదులు అందుతున్నాయి.
ఒక వైపు తెలంగాణ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తుండగా, దాన్ని పట్టించుకోనట్లు.. చిరంజీవిని బుజ్జగించేందుకు ఆజాద్ ఆయన ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆజాద్ హైదరాబాద్‌లో ఉండగానే రాజీనామాలు చేయాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకోవడం ఆయన వ్యవహార శైలిలో లోపాన్ని సూచిస్తున్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఆజాద్‌కు తెలుసా? ఆయన ఈ పరిణామాల గురించి అధిష్ఠానానికి ఎందుకు నివేదించలేదు? అని ఒక సీనియర్ నేత ప్రశ్నించారు.
రాజీనామాల ప్రకటనపై ఆజాద్ స్పందించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర రాష్ట్రాలతో, పార్టీలతో సంప్రదించాలని, రాజీనామాల వల్ల పరిష్కారం కాదని ఆజాద్ వ్యాఖ్యానించడం అర్థరహితమని, గతంలో ఎవర్ని సంప్రదించి తెలంగాణ ఇచ్చేందుకు అంగీకరించి టీఆర్ఎస్‌తో పొత్తు కుదుర్చుకున్నారని కాంగ్రెస్ రాజ్య సభ సభ్యుడొకరు ప్రశ్నించారు. ఎవరిని సంప్రదించి శ్రీకృష్ణ కమిటీని నియమించారని ఆయన నిలదీశారు. ఆజాద్ వైఫల్యం గురించి రాష్ట్రంలోనే ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఆస్కార్ ఫెర్నాండెజ్, సల్మాన్ ఖుర్షీద్ ఢిల్లీ నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ జరిగిన పరిణామాలపై ఆచితూచి స్పందించగా, ఆజాద్ అందుకు భిన్నంగా స్పందించడం కూడా చర్చనీయాంశమైంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

జపాన్ రేడియేషన్ ఇండియాకు వచ్చేస్తోందా?