ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంగతేంది..?
తెలంగాణ కంటే ముందు వర్గీకరణ అంశాన్ని తేల్చాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ ముసుగులో కావాలనే దళిత ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం మాదిగ సామాజిక వర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి వస్తే ఓర్వలేని దోరలు, తెలంగాణ వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి ఎలా చేస్తారని ప్రశ్నిం చారు. హన్మకొండలో ప్రొఫెసర్ జయ శంకర్.మృతికి నివాళి సమర్పించడానికి వెళ్లిన అనగారిన వర్గానికి చెందిన నేతలపై దాడులు చేసారని తీవ్రంగా విమర్శిం చారు. రాజీనామాల ప్రస్థానం నుండి మాదిగ ప్రజాప్రతి నిధు లను మినహాయించాలని మందకృష్ణ తెలంగాణవాదులను కోరారు.
దొరలు అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి ఆడుతున్న నాటకం తెలంగాణా ఉద్యమం అని తమరు ఇంకా గ్రహించలేదా గురువర్యా....మీరంతా బొయీలే...పల్లకీ లో మిమ్మల్ని ఎలా ఎక్కనిస్తారనుకున్నారూ??తెలంగాణా రానీయండి..తెల్ల మొగాలేద్దురు గానీ..
రిప్లయితొలగించండి