ఇప్పుడిక ఆర్టీసీ వంతు..!
ఆర్టీసి ఛార్జీలు పెంచడానికి రంగం సిద్దం అయింది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన నేపధ్యంలో పదిహేను రోజుల క్రితమే ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరుగుతాయని అనుకున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసి అదికారులు ఈ విషయమై అప్పుడే ప్రతిపాదన పెట్టినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానిని వాయిదా వేశారు. ఆర్టీసి నష్టాల ఊబిలో కూరుకు పోతుందని చెప్పి మళ్లీ ఈర్టీసి ఎమ్.డి బి. ప్రసాదరావు మళ్లీ మంత్రి, ముఖ్యమంత్రి లను కలిసి విజ్ఞప్తి చేయగా, ముఖ్యమంత్రి వారితో చర్చించి ఛార్జీల పెంపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీని ప్రకారం ఇరవై కిలోమీటర్ల దూరం వరకుఛార్జీలు పెరగవు. ఆ తర్వాత ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక్క కిలోమీటర్ కు ఇరవై పైసల చొప్పున పెంచవచ్చు. సాయంత్రం ఛార్జీల పెంపుపై అధికారికంగా ప్రకటన వెలువడవచ్చని అంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి