ఆడపిల్ల నాభిపై పుట్టుమచ్చ ఉంటే..? (Part-1)
పుట్టుమచ్చేకదా అని తేలిగ్గా తీసిపారేయకండి. శరీరంలోని ఏ భాగంలో పుట్టమచ్చ స్పష్టంగా కనబడుతుందో ఆ వివరాలను బట్టి మీ మనస్తత్వాన్నీ, మీ పనితీరుని అంచనా వేయవచ్చని ఈ మధ్యనే ప్రాశ్చాత్య దేశాల వారు సైతం ఓ శాస్త్రాన్ని తయారుచేశారు. మన పుట్టుమచ్చల శాస్త్రం ఎలానో ఉంది. మరి ఇతర దేశాల వారి నమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… నాభిపై పుట్టమచ్చ ఉంటే…ఆ స్త్రీ ఏ లక్షణాలతో ఉండవచ్చు. అలాగే, తొడమీద పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుంది? ఇంకా, పాదాలమీద పుట్టుమచ్చ కనిపిస్తే ఏ లక్షణాలు ఉంటాయి? ఈ వివరాలు ఇప్పుడు చూడండి…
నుదుటి మీద ఉంటే : మీరు మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు.
నుదుటి క్రింది భాగంలో ఉంటే : మీరు మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు.
కనుబొమ్మపై ఉంటే : మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈర్ష్య ఉండదు.
ముక్కుపై ఉంటే : కొంత మందిలో క్రమశిక్షణ లోపిస్తుంది. కోపంగా ఉండవచ్చు. ముక్కుమీద పుట్టుమచ్చ ఉన్న ఆడపిల్లను పెళ్లిచేసుకునే ముందు ఓసారి ఆలోచించడం మంచిదంటున్నారు ప్రాశ్చాత్యదేశాలవారు.
పెదవిపై ఉంటే : కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో మీకు ఈర్ష్య కలుగుతుంది. దాంపత్యజీవితంలో ముద్దులపై ఆసక్తి చూపుతారు.
బుగ్గపై ఉంటే : రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు. ఆడపిల్లలైతే దాంపత్యజీవితం సాఫీగా సాగిపోతుంటుంది.
నాలుకపై ఉంటే : మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు.
భుజంపై ఉంటే : మీరు మర్యాదస్తులు, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు.
మోచేయిపై ఉంటే : మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.
ఎడమ చంక భాగంలో ఉంటే : మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి.
కుడి చంక భాగంలో ఉంటే : భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు.
మెడ భాగంలో ఉంటే : కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు. ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు.
శరీరం ముందు భాగంలో ఉంటే : ఆకస్మిక ధన లాభం.
శరీరం వెనుక భాగంలో ఉంటే : మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.
ఛాతీ భాగంలో ఉంటే : మీకు మనశ్శాంతి ఉండదు. కొందరికి జీవితంలో కష్టాలు తప్పవు.
శరీరం కుడి భాగంలో ఉంటే : మీ సోమరితనం కుటుంబం పై ప్రభావం చూపుతుంది. ఉల్లాసంగా ప్రయాణాలు సాగిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు.
శరీరం ఎడమ భాగంలో ఉంటే : మీరు ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. జీవితంలో అనుకున్నది సాధిస్తారు.
మరిన్ని వివరాలు (2 పార్ట్‌లో)
- ఎన్నార్టీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి